సినిమా కి ప్రాణం మ్యూజిక్ అన్న విషయం అందరికి తెలిసిందే.సినిమా పాటలు బాగుంటే సినిమా హిట్ అని కొందరు నాముతారు.అలాగే కొన్ని చిత్రాలు పాటలతో అందరిని బాగా ఆకట్టుకున్నాయి.అలంటి పాటలు బాగా రావాలంటే సంగీతం తో పాటు స్వరం కూడా కావాలి.సాధారణంగా గాయని గాయకులూ సినిమాలలో సినీ ఫంక్షన్స్ లో పాట పాడి అందరిని రంజింప చేస్తారు.
వివరాలలోకి వెళ్తే, సెలబ్రిటీల పార్టీల్లో తప్ప, సాధారణ ప్రజల ఇంటికి వచ్చి తాను కచేరీలు ఇవ్వలేనని చెప్పిన ఓ గాయనిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన పాకిస్థాన్ లోని మర్దన్ ప్రాంతంలో జరిగింది. తన ఇంట్లో పార్టీ నిర్వహించిన నయీమ్ ఖత్తక్ అనే వ్యక్తి, పాటలు పాడాల్సిందిగా ప్రముఖ గాయని సుంబుల్ ఖాన్ (25)ను ఆహ్వానించాడు.
ఆమె నిరాకరించడంతో, ఆగ్రహించిన నయీమ్, తొలుత మరో ఇద్దరితో కలసి ఆమె ఇంట్లోకి చొరబడి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి బలవంతంగానైనా కచేరీ చేయించాలని భావించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తుపాకితో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సుంబుల్ ఖాన్ అక్కడికక్కడే మరణించింది. దాడి జరిపిన నయీమ్ ను మాజీ పోలీసు అధికారిగా గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశామని, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నామని తెలిపారు.