Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పాపం పాట పాడటానికి వెళ్లిన సింగర్ సునీతని......

Category : movies

సింగర్ సునీత ఈ మధ్య సినిమా పాటలకంటే స్టేజి షో లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా శ్రీకాకుళంలో గురువారం సాయంత్రం సింగర్ సునీత సంగీత విభావరి కార్యక్రమం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏపీ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగర వైఎస్ ఆర్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సునీత పాటలు పాడేందుకు అక్కడకు వెళ్లారు.

అయితే పోలీసు వారి నుండి అనుమతి తీసుకోవడంలో నిర్వాహకులు అలసత్వం ప్రదర్శించిన కారణంగా కార్యక్రమం క్యాన్సిల్ అయ్యింది. అయితే పోలీసుల నుండి మొదటే ఆ కార్యక్రమానికి అనుమతి తీసుకోకపోవడంతో చివరి నిమిషంలో కార్యక్రమాన్ని పోలీసులు ఆపేయడం జరిగింది. సాయంత్రం సమయంలో నిర్వాహకులు పోలీసుల పర్మీషన్ కు ప్రయత్నాలు చేశారు.

ఎస్పీ నుండి అనుమతి వచ్చేప్పటికి రాత్రి 8 గంటలు అయ్యింది. అయితే అప్పటికే షో కు వచ్చిన జనాలు మరియు గెస్ట్ లు వెళ్లి పోయారు. అలా షో క్యాన్సిల్ అయ్యింది. శ్రీకాకుళం జనాలు సునీత పాటలు వినేందుకు ఎంతో ఆసక్తి చూపించినా నిర్వాహకుల వల్ల అది సాధ్యం కాలేదు. ఈ విషయమై సునీత కూడా నిర్వాహకులపై అసహనంను వ్యక్తం చేసినట్లుగా సమాచారం అందుతోంది.

Related News