//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హీరోయిన్ గా మారిన టాప్ సింగర్...

Category : movies

ఎన్నో అద్భుతమైన పాటలు పాడి టాలీవుడ్ లో ప్రేత్యేక గుర్తింపు పొందిన గాయని గీతా మాధురి. ఆతరువాత నటుడు నందుని వివాహం చేసుకున్నారు. ఈ మధ్యనే బిగ్ బాస్ 2 ర‌న్న‌ర‌ప్ గా గెలిచి య‌మ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ అమ్మడికి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది.

యాక్షన్, థ్రిల్లర్ గా తెరకెక్కబోయే ఈ చిత్రం కథ నచ్చడంతో ఆమె ఓకే చేసిందట. త్వరలోనే సినిమా షూటింగ్ కూడా మొదలుకానుందని తాజా సమాచారం. సినిమాలలో నటించినంత మాత్రాన పాటలు పాడడం ఆపనని గీతమాధురి అంటుంది. గీతామాధురి అలా చెప్పడంతో భవిష్యత్తులో నందు సినిమాలో కూడా హీరోయిన్ అవకాశం వస్తే నటిస్తుందో, లేదో అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.