//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అతను అసభ్యంగా తాకాడు : గాయని శ్రీపాద చిన్మయి

Category : movies

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాదకు చేదు అనుభవం ఎదురైందట.

గడచిన ఆదివారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన గాయని, నటి శ్రీపాద చిన్మయి, తనకు ఎదురైన ఓ భయానక అనుభవాన్ని ట్విట్టర్ లో పంచుకుంది. ఓ వ్యక్తి తనను అసభ్యంగా పట్టుకున్నాడట. ఈ ఘటన తనను షాక్ కు గురిచేసిందని, తమ చిన్నతనంలో ఎంతమంది అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురై ఉంటారో తలచుకుని వణికిపోయానని వెల్లడించింది. చాలా మంది తమకు ఎదురైన అనుభవాలను ఎవరితోనూ చెప్పడం లేదని పేర్కొంది.

అమ్మాయిలు ధైర్యంగా చెప్పినా వారినే తప్పుబడుతున్న పరిస్థితి నెలకొందని అభిప్రాయపడింది. తాను ధైర్యం చేసి తనకెదురైన చేదు అనుభవాన్ని చెబుతున్నానని పేర్కొంది. ఎంతో మంది వేధింపులకు గురవుతున్న అమ్మాయిలు, బయటకు చెబితే ఇంట్లోనే ఉండిపోవాలన్న ఒత్తిడి వస్తుందన్న భయంతో చెప్పుకోవడం లేదని తెలిపింది.

బాధితులను మహిళలే కించపరుస్తున్నారని ఈ పరిస్థితి మారాలని తెలిపింది. కాగా, తనకు లైంగిక వేధింపులు ఎదురైనట్టు చిన్మయి గతంలోనూ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Related News