Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ట్రైలర్ టాక్ : టెంపర్ రీమేక్ లో ఫీల్ ని చంపేశారు

Category : movies

తెలుగులో పూరి జగన్నాద్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం టెంపర్. వక్కంతం వంశి ఈ చిత్రానికి కథ అందించాడు. కధలో ఉన్న ఇంటెన్సిటీని స్క్రీన్ మీద సరిగ్గా ప్రాజెక్ట్ చేసాడు పూరి. ఈ సినిమాకి ఎన్టీఆర్ నటన బిగ్గెస్ట్ అసెట్ గా నిలిచి సినిమా ని బ్లాక్ బస్టర్ చేసారు. మొదటిలో ఈ సినిమా రీమేక్ విషయం లో ఎవ్వరు ధైర్యం చెయ్యలేదు.

ఎన్టీఆర్ నటనను మ్యాచ్ చెయ్యడం కష్టంగా భావించి అందరు వెనకడుగు వేశారు. ఎట్టకేలకు మూడేళ్ళ తరువాత ఈ సినిమా ని హిందీ లో సింబా పేరు రణ్వీర్ సింగ్ హీరోగా బాలీవుడ్ మాస్ డైరెక్టర్ రోహిత్ శెట్టి టెంపర్ ని రీమేక్ చేసాడు. దీనికి సంబంధించిన ట్రైలర్ బైటికి వచ్చింది. ట్రైలర్ చూస్తున్నంతసేపు అసలు ఇది టెంపర్ రీమేక్ యేన అన్నట్టు ఉంది. కథలో ఉన్న ఫీల్ ఎక్కడా కనిపించలేదు. టోటల్ గా సినిమా పై ఫీల్ మారిపోయింది. రోహిత్ శెట్టి గతంలో అజయ్ దేవగన్ తో సింగం సినిమాని తీసాడు.

ఈ ట్రైలర్ కూడా అజయ్ దేవగన్ తోనే మొదలైంది. సింగం కి సీక్వెల్ గా దీన్నే ఎలేవేటే చేసినట్టు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. మరి సినిమా ఎలా ఉంటుందో.డిసెంబర్ 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టెంపర్ ని హిందీలోనే కాకుండా తమిళ్ లో విశాల్ హీరోగా అయోగ్య గా రీమేక్ అవుతుంది.

Related News