//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సైమా నామినేష‌న్స్ విడుద‌ల‌.. ఉత్త‌మ న‌టుడు ఎవరో తెలుసా....?

Category : movies

ద‌క్షిణాది తార‌లంతా ఒకే చోట చేరి సంద‌డి చేసే ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ సైమా. దీన్నే సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్ అని పిలుస్తుంటారు. ఈ వేడుక ప్ర‌తి సంవ‌త్స‌రం అంగ‌రంగ వైభవంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌కి సంబంధించిన సెల‌బ్రిటీలు ఈ వేడుక‌కి హాజ‌రు కానున్నారు. న‌టీమ‌ణుల గ్లామ‌ర్ తో , రాక్ ప‌ర్ఫార్మెన్స్ తో, సెల‌బ్రిటీల ఆట పాట‌ల‌తో సైమా వేడుక ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు ఎడిష‌న్స్ పూర్తి చేసుకున్న సైమా ఈ ఏడాది దుబాయ్‌లో ఏడో ఎడిష‌న్ జ‌రుపుకోనుంది.

సెప్టెంబ‌ర్ 14, 15వ తేదీల‌లో సైమా వేడుకని ఘ‌నంగా నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు నిర్వాహ‌కులు తెలిపారు. అయితే తాజాగా 2017 సంవ‌త్స‌రంలో విడుద‌లైన చిత్రాల‌కి సంబంధించి నామినేష‌న్స్ ప్ర‌క‌టించారు. ఇందులో తెలుగుజాతి ఖ్యాతిని విశ్వ‌వ్యాప్తం చేసిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ఏకంగా 12 విభాగాల్లో నామినేషన్లను దక్కించుకుంది. వివిధ కేటగిరీల‌లో నామినేష‌న్స్ ద‌క్కించుకున్న చిత్రాలు, న‌టుల వివ‌రాలు ....

ఉత్తమ చిత్రం

- బాహుబలి: ది కన్‌క్లూజన్‌

- ఫిదా

- గౌతమీపుత్ర శాతకర్ణి

- ది ఘాజీ ఎటాక్‌

- శతమానం భవతి

ఉత్తమ దర్శకుడు

- క్రిష్‌(గౌతమీపుత్ర శాతకర్ణి)

- ఎస్‌ఎస్‌ రాజమౌళి(బాహుబలి2)

- సందీప్‌ వంగా(అర్జున్‌రెడ్డి)

- సంకల్ప్‌రెడ్డి(ది ఘాజీ ఎటాక్‌)

- సతీష్‌ వేగేశ్న(శతమానం భవతి)

ఉత్తమ నటుడు

- నందమూరి బాలకృష్ణ(గౌతమీపుత్ర శాతకర్ణి)

- ప్రభాస్‌(బాహుబలి2)

- విజయ్‌ దేవరకొండ(అర్జున్‌రెడ్డి)

- ఎన్టీఆర్‌(జై లవ కుశ)

- రానా దగ్గుబాటి(నేనే రాజు నేనే మంత్రి)

ఉత్తమ నటి

- అనుష్క(బాహుబలి2)

- రకుల్‌ప్రీత్‌సింగ్‌(జయ జానకీ నాయక)

- కాజల్‌(నేనే రాజు నేనే మంత్రి)

- రితికా సింగ్‌(గురు)

- సాయిపల్లవి(ఫిదా)

ఉత్తమ సహాయనటుడు

- ఆది పినిశెట్టి(నిన్నుకోరి)

- ప్రకాష్‌రాజ్‌(శతమానం భవతి)

- కేకే మేనన్‌(ది ఘాజీ అటాక్‌)

- సత్య రాజ్‌(బాహుబలి2)

- శ్రీవిష్ణు(ఉన్నది ఒకటే జిందగీ)

ఉత్తమ సహాయనటి

- భూమిక (ఎంసీఏ)

- జయసుధ(శతమానంభవతి)

- రమ్యకృష్ణ(బాహుబలి2)

- హేమమాలిని(గౌతమీ పుత్ర శాతకర్ణి)

- రాధిక(రాజా ది గ్రేట్‌)

ఉత్తమ సంగీత దర్శకుడు

- ఎస్‌ఎస్ ‌తమన్‌(మహానుభావుడు)

- దేవి శ్రీ ప్రసాద్‌(ఖైదీ నంబర్‌ 150)

- ఎం.ఎం. కీరవాణి(బాహుబలి2)

- శక్తికాంత్‌(ఫిదా)

- గోపీ సుందర్‌(నిన్నుకోరి)

ఉత్తమ ప్రతినాయకుడు

- రానా దగ్గుబాటి( బాహుబలి2)

- తరుణ అరోరా( ఖైదీ నంబరు 150)

- రావు రమేష్‌(డీజే: దువ్వాడ జగన్నాథమ్‌)

- అర్జున్‌(లై)

- విజయ్‌ వర్మ(ఎంసీఏ)

ఉత్తమ హాస్యనటుడు

- రాహుల్‌ రామకృష్ణ(అర్జున్‌రెడ్డి)

- శ్రీనివాస్‌రెడ్డి(ఆనందో బ్రహ్మ)

- ప్రవీణ్‌ (శతమానం భవతి)

- బ్రహ్మానందం(ఖైదీ నంబర్‌ 150)

- షకలక శంకర్‌(ఆనందో బ్రహ్మ)

Related News