//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సిద్దరామయ్యను భయపెడుతున్న శశికళ జైలు కుంభకోణం !

Category : national

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలిగా పలు భారీ కుంభకోణాలకు పాల్పడటంతో పాటు,నేరుగా జయలలితకు జైలు శిక్ష పడడానికి కారణమైన అన్నాడీఎంకే నాయకురాలు శశికళ అంటే ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య భయపడుతున్నారు. ప్రస్తుతం బెంగళూరు లోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆమె  జైలు అధికారులకు భారీ ముడుపులు చెల్లించి సకల భోగాలు అనుభవిస్తున్నారని వస్తున్న ఆరోపణలు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

వచ్చే సంవత్సరం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో శశికళకు అనుకూలంగా కనిపిస్తే `కన్నడ సెంటిమెంట్' కాటు వేస్తుందని ముఖ్యమంత్రి   కలవరం చెందుతున్నారు. అందుకనే వెంటనే ఈ సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. పైగా వెంటనే ఆమెను ఆ జైలు నుండి మరో జైలుకు తరలించనున్నారు.  

శశికళ తనకు కారాగారంలో సకల సౌకర్యాలు లభించేందుకు వీలుగా రూ. 2 కోట్లు జైలు అధికారులకు లంచం చెల్లించిందని స్వయంగా జైళ్లశాఖ డీఐజీ రూప  నివేదిక సమర్పించడంతో తక్షణ చర్య తీసుకోక ముఖ్యమంత్రికి తప్పడం లేదు. పైగా ఆమె ఈ వ్యవహారంలో కర్ణాటక జైళ్లశాఖ డీజీపీ హెచ్‌ఎన్‌ సత్యనారాయణరావుకు సైతం ముడుపులు అందాయని ఆరోపణలు చేయడం ప్రభుత్వం వర్గాలలో పెను దుమారం రేపుతున్నది. 

మరోవైపు డీఐజీ రూప గురువారం మీడియాతో మాట్లాడుతూ తన నివేదికలో పొందుపరిచిన ప్రతి అంశానికి తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తనపై ఎవరి ఒత్తిడి లేదని, విచారణలో అన్ని విషయాలు వెలుగు చూస్తాయని పేర్కొన్నారు. ముడుపులు తీసుకున్న అధికారులు ఆమెకు ప్రత్యేకంగా ఒక వంటి గదిని, వంట మనిషి వంటి పలు ప్రత్యేక  సదుపాయాలు కల్పించారని రూప తెలిపారు.