//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ట్వీట్లతో చెమటలు పట్టిస్తున్న సిద్దరామయ్య

Category : national

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోషల్ మీడియా వేదికగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడికి సవాల్ చేసారు. మంగళవారం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో 3 సభల్లో.. చామరాజనగర్‌ జిల్లా సంతెమారహళ్లి, ఉడుపి, బెళగావి జిల్లా చిక్కోడిల్లో ప్రసంగించారు. పార్లమెంటులో 15 నిమిషాలు మాట్లాడేందుకు తనకు అవకాశమిస్తే.. మోదీ ఆ పావుగంట సభలో కూర్చోలేరని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై మోదీ తీవ్రంగా స్పందించారు.

‘‘అసలు ఆయన 15 నిమిషాలు మాట్లాడడమే గొప్ప. అదే జరిగితే ఆహా.. క్యా సీన్‌హై అనుకున్నాను. కాంగ్రెస్‌ అధ్యక్షులవారూ! నిజమే.. మేం మీ ముందు కూర్చోలేం. ఎందుకంటే మీరు గొప్పపేరున్నవారు.. నేనేమో మామూలు కార్యకర్తను. మీ ముందు కూర్చునే స్థాయి మాకు లేదు. సరే.. మీ చేతిలో పేపరు లేకుండా15 నిమిషాలు హిందీలో గానీ, ఆంగ్లంలో గానీ, మీ అమ్మగారి మాతృభాష (ఇటాలియన్‌)లో గానీ ఆశువుగా మాట్లాడండి చూద్దాం. అప్పుడు కర్ణాటక ప్రజలు మీ నాయకత్వాన్ని అంగీకరిస్తారు’’ అని ఎద్దేవాచేశారు.

దీనికి సిద్దరామయ్య స్పందించారు. ‘‘మోదీజీ.. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను.. యడ్యూరప్ప ప్రభుత్వం కర్ణాటకలో చేసిన అభివృద్ధి గురించి పేపర్ చూసే 15 నిమిషాలు మాట్లాడండి’’ అంటూ సిద్ధరామయ్య ప్రతి సవాల్ విసిరారు. అలాగే మోడీ..దేవెగౌడ గౌరవనీయులు అని మాట్లాడగా దానికి స్పందించిన సిద్దరామయ్య 'మోదీకి ఇంత అకస్మాత్తుగా దేవెగౌడపై ఎందుకు ప్రేమ కలిగిందో' అంటూ సిద్ధరామయ్య ఓ ట్వీట్‌లో నిలదీశారు. దేవెగౌడను వృద్ధాశ్రమానికి పంపుతానంటూ కొద్దికాలం క్రితమే మోదీ అన్నారని, ఇప్పుడు అకస్మాత్తుగా ఆయనపై ప్రేమ నటిస్తున్నారని సీఎం ఎద్దేవా చేశారు. ఈ కొత్త ప్రేమ వెనుక పెద్దగా రహస్యం అంటూ ఏమీ లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ మధ్య రహస్య అవగాహనే ఇందుకు కారణమని సిద్ధరామయ్య విమర్శించారు.