//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులు

Category : state

కలుషిత పానీ పూరి తిని సుమారు 20 నుంచి 30 మంది వరకు చిన్నారులు అస్వస్థతకు గురైన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపాల్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..

శనివారం రాత్రి తోపుడు బండిపై పానీపూరి వ్యాపారి పట్టణంలోని శేరెల్లివీధిలో చిన్నారులు పానీపూరి తిన్నారు. గంట తర్వాత అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హుటా హుటిన గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయాన్ని పోలీసులకు తెలియడంతో వెంటనే ఆసుపత్రికి చేరుకొని సంఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నామని తెలిపారు.

కలుషిత నీటితో పానీపూరి తయారు చేయడంతో వాటిని తిని అస్వస్థతకు గురైనట్లు తెలిసిందన్నారు. అర్ధరాత్రి పానీపూరి వ్యాపారి ఉత్తరప్రదేశ్‌కు చెందిన పెర్మోద్‌ కోసం గాలించి పట్టుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, అందరు క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు

Related News