//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Shriya Saran Movies : శ్రీయ శరన్ సినిమాలు : Hot Actress Sriya shreeya Sharan photos family images videos marriage galleries caste bio data

Category : editorial

శ్రియా సరన్ తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ మరియూ ఆంగ్ల భాషల్లో నటించిన ప్రముఖ నటి. సెప్టెంబరు 11, 1982లో జన్మించింది.2001 లో టాలీవుడ్ లోకి వచ్చిన శ్రీయ ఇప్పటికి కూడా క్రేజీ హీరోయినే.

టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చిన తరుణం లో శ్రీయ కి అన్నీమంచిరోజులే అన్నటుగా చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని నమోదు చేసాయి .త్రివిక్రమ్,తరుణ కలయిక లో వచ్చిన నువ్వే నువ్వే సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

ఆ తరువాత టాలీవుడ్ లోని టాప్ స్టార్స్ అందరి తోనూ నటించింది.తరువాత తరం హీరోస్ అయిన స్టార్స్ తో కూడా నటించింది.

టాలీవుడ్ లోని సీనియర్ హీరోల పాలిట శ్రీయ దేవతలా మారింది. గత ఏడాది శ్రీయ బాలయ్య సరసన రెండు చిత్రాల్లో నటించింది. తాజగా ఈ భామ మరో క్రేజీ అఫర్ ని దక్కించుకోవడం విశేషం. శ్రీయ జోరు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

శ్రీయ మూడు పదుల లేటు వయసులో కూడా కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతోందంటే నిజంగా విశేషమే. సాధారంణంగా హీరోయిన్ల ఏజ్ పెరిగే కొద్దీ అవకాశాలు సన్నగిల్లుతాయి. శ్రీయకు కూడా గతంలో అవకాశాలు తగ్గాయి. కానీ గత రెండేళ్ల కాలంలో శ్రీయ మళ్ళి జోరు చూపిస్తోంది.

గత ఏడాది శ్రీయ ఒక్క బాలయ్య సరసనే రెండు చిత్రాల్లో నటించింది. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం గత ఏడాది సంక్రాంతికి విడుదల కాగా,ఆ తరువాత పైసా వసూల్ లో కూడా బాలయ్యతో రొమాన్స్ చేసింది.

శ్రీయ ఇటీవల విదులైన గాయత్రీ చిత్రంలో కేకల పాత్రలో నటించింది. త్వరలో రాబోతున్న వీర భోగ వసంత రాయులు చిత్రంలో నటిస్తోంది.

శ్రీయ తాజాగా మరో క్రేజీ అఫర్ పట్టేసింది.దర్శకుడు తేజ, వెంకటేష్ కాంబినేషన్ లో రూపుదిద్దుకోబోతున్న చిత్రంలో హీరోయిన్ గా శ్రీయ ఎంపికైంది. నేనే రాజు నేనే మంత్రి విజయంతో ఉత్సాహంలో ఉన్న తేజ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో శ్రీయ సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల వంటి చిత్రాల్లో వెండి సరసన నటించింది.

శ్రీయ ఇటీవల సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. లేటు వయసులో కూడా తన గ్లామర్ లో పదును తగ్గలేదని కుర్ర కారుకు సోషల్ మీడియా ద్వారా అందాల బాణాలు వదులుతోంది.