//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సైనా నెహ్వాల్ బయోపిక్‌ లో బాలీవుడ్‌ శ్రద్ధాకపూర్.

Category : sports movies

నేటి అమ్మాయిలను తమవైపుకు తిప్పుకున్న గొప్ప క్రీడాకారిణులు సానియా మీర్జా, సైనా నెహ్వాల్ ,ఆటలో తమదైన శైలిని ప్రదర్శిస్తూ నేటి యువతీ మనుసులో నిలిచిపోయారు. అలాంటి ఆటగాళ్లలో ఒకరైన షటిల్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్‌ని తీయాలని బాలీవుడ్‌ నిర్ణయించింది.అసలే బాలీవుడ్‌కు బయోపిక్‌లకు అవినాభావ సంబంధం ఉందని అందరికీ తెలిసిన విషయమే. ప్రముఖ ఆటగాళ్ళైనా 'ఎమ్ఎస్ ధోనీ', 'సచిన్ టెండూల్కర్' వంటి గొప్ప క్రీడాకారుల జీవితాలను తెరకెక్కించిన బాలీవుడ్ అదే శైలితో సైనా నెహ్వాల్ బయోపిక్‌తో ముందుకొస్తోంది.అయితే సైనా పాత్ర మాత్రం బాలీవుడ్‌ ప్రముఖ నటి శ్రద్ధాకపూర్ కి దక్కటం విశేషం, సైనా పాత్ర పోషించే అవకాశం శ్రద్ధాకపూర్ రావడంతో ఆమె సంతోషంగా ఉన్నట్లు శ్రద్ధా కపూర్‌ ట్వీట్‌ చేశారు.

సైనా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సైనా నెహ్వాల్‌ బయోపిక్‌కి ఇప్పడు రంగం సిద్ధమైంది.సైనా జీవిత చరిత్రలో శ్రద్ధాకపూర్‌ టైటిల్‌ పాత్రలో కనిపించనున్నట్లు,‘సైనా’ సినిమాలో టైటిల్‌ రోల్‌ రావడం తన అదృష్టమని ట్విట్టర్‌ ద్వారా శ్రద్ధాకపూర్‌ తెలిపారు.ఈ చిత్రానికి అమోల్‌ గుప్తే దర్శకత్వం వహిస్తున్నారు. టీ– సీరీస్‌ సంస్థ సినిమాను నిర్మిస్తోంది.