Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి.. ఇద్దరి పరిస్థితి విషమం..

Category : state politics

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గరు కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నం హార్బర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ దాడికి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సోదరుడు హరనాథబాబే కారణమంటూ బాధితులు వాపోయారు. గాయపడిన ముగ్గురు రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సుమారు 20 మంది వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని తెలిపారు బాధితులు.

Related News