Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తన మంత్రి పదవి పై మౌనం వహిస్తున్నరోజా.. జగన్ ముందే హామీ ఇచ్చారంటున్న పార్టీ వర్గాలు, ఇందులో నిజమెంత..?

Category : state politics

మే 23 న వెలువడనున్న ఏపి ఎన్నికల ఫలితాలపై వైసీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది.ఈ సారి ఎలాగైనా అధికారలోకి వస్తామన్న ఆశ భావం వ్యక్తం చేస్తుంది.ఇక పోతే వైసీపీ గనుక అధికారంలోకి వస్తే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ కీలక నేత, నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి గ్యారంటీ అంటూ టాక్ వినిపించింది. రోజాకు జగన్ కేబినెట్‌లో ముఖ్యమైన పదవి లభిస్తుందని మొదటి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది.అలాగే రోజా మహిళ నేత కావడం ఆమెకు బాగా కలిసొచ్చే అంశం.

అయితే చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ కేబినెట్‌లో ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని... ఆ తరువాతే రోజా పేరును వైసీపీ అధినాయకత్వం పరిశీలిస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వస్తే తన పరిస్థితి ఏమిటనే దానిపై వస్తున్న ఊహాగానాలపై రోజా స్పందించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.తనకు మంత్రి పదవి ఖాయం అంటూ వస్తున్న వార్తలపై .ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో ఒకరైన కొడాలి నాని సైతం స్పందించారు.

పార్టీ అధినేత వై.ఎస్ జగన్ ఏం నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని... పరోక్షంగా తనకు మంత్రి పదవి ఇచ్చే విషయంపై జగన్‌దే తుది నిర్ణయమని ఆయన తేల్చేశారు. నిజానికి రోజా కూడా తనపై వస్తున్న అనేక ఊహాగానాలకు ఆమె సైతం ఇలాంటి సమాధానమే చెప్తారని వైసీపీ వర్గాలు భావించాయి. కానీ ఆమె మాత్రం తనపై వస్తున్న ఏ వార్తపై కూడా స్పందించకపోవడం గమనార్హం.అయితే వైసీపీ అధికారంలోకి వస్తే తన పొజిషన్ ఏమిటనే విషయంలో రోజాకు ఓ అవగాహన ఉందని... ఈ విషయంలో ఇప్పటికే జగన్ ఆమెకు ఓ క్లారిటీ కూడా ఇచ్చినట్టు టాక్ . ఈ కారణంగానే తనపై వస్తున్న అనేక వార్తలపై ఆమె ఏ మాత్రం స్పందించడం లేదనీ కొందరు వైసీపీలోని కీలక నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఫలితాలు వచ్చి... తన గెలుపు ఖాయమైన తరువాతే తనపై వస్తున్న వార్తలపై రోజా స్పందించే అవకాశం ఉందనే వార్త కూడా ప్రచారం లో ఉంది.

Related News