Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీ అభ్యర్థుల గురించి బయటికొచ్చిన సంచలన విషయాలు

Category : state politics

ఏపీ ఎన్నికలు మరికొద్ది గంటల్లో జరగనున్న నేపథ్యంలో ఏపీ ఎలక్షన్ వాచ్(ఏపీఈడబ్ల్యూ) అండ్ అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్(ఏడీఆర్) ఓ నివేదికను వెల్లడించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న 2118 మంది అభ్యర్థులకు గానూ 2007 మంది అభ్యర్థుల అఫిడవిట్ వివరాలను సమగ్రంగా విశ్లేషించి నివేదికను వెల్లడించినట్లు ఈ సంస్థ పేర్కొంది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. వైసీపీ తరపున పోటీ చేస్తోన్న 175 మంది అభ్యర్థుల్లో 57శాతం మందిపై అంటే 97 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. వీళ్లలో 57 మంది వైసీపీ అభ్యర్థులపై సీరియస్ క్రిమినల్ కేసులున్నట్లు ఏపీఈడబ్ల్యూ అండ్ ఏడీఆర్ పేర్కొంది. 2007 మంది అభ్యర్థుల్లో 632 మంది అభ్యర్థులు కోటీశ్వరులేనని నివేదిక వెల్లడించింది.

వైసీపీ అభ్యర్థుల్లో 159 మంది, టీడీపీ అభ్యర్థుల్లో 157 మంది, జనసేన అభ్యర్థుల్లో 83 మంది అభ్యర్థులు కోటీశ్వరులని అఫిడవిట్లను పరిశీలించిన తర్వాత తేలినట్లు ఏపీఈడబ్ల్యూ తెలిపింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థుల్లో 901 మంది 5వ తరగతి నుంచి ఇంటర్ చదివిన వారేనని.. 957 మంది గ్రాడ్యుయేషన్, ఆపైన చదివిన వారని నివేదికలో వెల్లడైంది. 648 మంది అభ్యర్థులు 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్కులని, 1128 మంది 41 నుంచి 60 సంవత్సరాల వయసున్న వారని, 220 మంది 61 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్కులని ఏపీఈడబ్ల్యూ పేర్కొంది. నలుగురు అభ్యర్థులు తమ వయసు 80 సంవత్సరాల వయసు పైనే అని తెలిపారని, ఏడుగురు అభ్యర్థులు వారి వయసునే వెల్లడించలేదని రిపోర్ట్‌లో ఏపీఈడబ్ల్యూ అండ్ ఏడీఆర్ పేర్కొంది.

Related News