Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజకీయాల్లో ఆలీ షాకింగ్ ట్విస్ట్ లు ... ప్రస్తుతానికి ఆయన కన్ఫ్యూజన్ పార్టీ

Category : state politics

ప్రధాన రాజకీయ పార్టీలకు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తున్నారు కమెడియన్ ఆలీ . ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆయన చేస్తున్న పనులు, కలుస్తున్న పార్టీల అధినేతలు అసలు ఆయన ఏం చెయ్యబోతున్నారు అన్న కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తున్నాయి. మొన్నటికి మొన్న జగన్ ను కలిసి పార్టీ చేరే ముహూర్తం సిద్ధం చేసుకున్న ఆలీ ,తాజాగా పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఇక జనసేనకు జై కొడతారు అని అందరూ భావిస్తే టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి షాక్ ఇచ్చారు .

ఇంతకీ ఆయన ఏ పార్టీ లో చేరుతున్నారు అనేది అందరికీ ఆసక్తి కలిగిస్తున్న అంశం . హీరో కమ్ క‌మెడియ‌న్ అలీ రానున్న ఎన్నికల నేపధ్యంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. గ‌త కొన్ని నెలలుగా రాజ‌కీయాల‌పై గ‌ట్టిగానే దృష్టిపెట్టిన ఆలీ ఏ పార్టీ లో చేరకున్నా నాయ‌కులంద‌రితో స‌న్నిహితంగా మెలుగుతున్నాడు. పవన్ కు అత్యంత సన్నిహితుడు కావటం తో జనసేనలో చేరి ఏదైనా కీలక పదవిలో ఉంటాడని అంతా ఊహించారు . కానీ పవన్ తో కలిసి తిరిగినా ఆలీ ఎక్కడా జనసేనకు జై అనలేదు. చాలా బాలన్స్ చేసి రాజకీయ పార్టీల అధినేతలందరితోనూ సన్నిహిత సంబంధాలు నెరపుతున్నారు ఆలీ.

ఇటీవల ఆలీ వైకాపా అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తో వైజాగ్ ప్లైట్ లో కలిసి మాట్లాడారు. ఆ ఫోటోలు బయటకు రావటంతో వైసీపీలో చేరతారు అని భావించారు. ఇక వైసీపీ చేరటానికి రెడీ అయిపోయారు అని భావించిన తరుణంలో జనసేనాని తో భేటీ అయ్యారు. అక్కడ మంతనాలు చేశారు. జనసేనతోనే ఆలీ ఉంటారు అని జనసేన నాయకులు ఇలా చెప్పారో లేదో మళ్ళీ వెళ్లి కొద్ది ఆలీ ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ని క‌లిశాడు. బాబుతో ఏకాంతంగా అర‌గంట‌కు పైగా మంత‌నాలు జ‌రిపాడు. ఇక అంతసేపు ఏం మాట్లాడారో తెలీదు. అంతకు ముందు జనసేనాని ఏం మాట్లాడారో తెలీదు. మొత్తానికి ఆలీ ఇప్పుడు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తూ అందర్నీ కన్ఫ్యూజన్ లో పడేశారు.

ఇక అక్కడితో ఆగలేదు మళ్ళీ బాబుతో భేటీ అనంతరం అమ‌రావ‌తిలో ఉన్న జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కలిశారు. ఇక పవన్ తో రెండు గంటలకు పైగా మంతనాలు చేసారు. అసలు పవన్ ను కలిసి ఆ తర్వాత చంద్రబాబు దగ్గరకు వెళ్ళటం మళ్ళీ పవన్ దగ్గరకు వచ్చి భేటీ అవ్వటం వెనుక మతలబు ఏంటి అనేది అందరూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. ఇక వారి మీటింగ్ సారాంశం ఏమిటి అనేది మాత్రం ఇంకా అంతు చిక్కలేదు. రానున్న ఎన్నికల నేపధ్యంలో టీడీపీ , జనసేనల మధ్య ఆలీ రాజ‌కీయంగా చ‌క్రం తిప్పాల‌నుకుంటున్నాడా లేకా మరి ఇంకేదైనా ఆలోచనతో ఇలా చేస్తున్నారా అన్నది మాత్రం త్వరలోనే తేలుతుంది. ఇక పవన్ అభిమానులు ఇప్పటికే ఈ రన్నింగ్ ఎందుకు బాసు అని సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు. ఈ హుటాహుటీ భేటీల వెనుక ఏదో మర్మం వుంది అనేది మాత్రం అందరికీ అర్ధం అవుతోంది . ఇక ఏపీ రాజకీయాల్లో ఆలీ ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయాడు.

Related News