Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

షాకింగ్ : వై ఎస్ వివేకాను కిరాయి హంతకులతో హత్య

Category : state politics

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను వేగవంతం చేసింది సిట్‌ బృందం . వివేకాను కిరాయి హంతకులతో హత్య చేయించినట్లు పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు కోట్ల రూపాయాలు ఒప్పందం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది.. కిరాయి హంతకులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ హత్య వెనక ఉన్నదెవరు..ఏమి ఆశించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.. తదితర కారణాలను పూర్తిస్థాయిలో బయట పెట్టేందుకు సిట్ బృందం, పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.. ఈ హత్య కేసులో దిద్దెకుంట శేఖర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని అనుచరులైన మరో నలుగురిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని కడపకు తరలించినట్లు సమాచారం.

వీరితోపాటు వేముల మండలం వేల్పుల గ్రామానికి చెందిన రాగిపిండి సుధాకరరెడ్డిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. సింహాద్రి పురం మండలం దిద్దికుంట గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డిపై పులు హత్యకేసుల్లో ప్రధాన నింధితుడు. పులివెందుల పీఎస్‌లో ఇప్పటికే ఇతనిపై రౌడీషీట్ తెరిచారు. పులివెందలలోని నగరిగుట్టకు చెందిన ఓవ్యక్తి హత్యకేసులో ప్రధాన నిందితుడుగా శేఖర్ రెడ్డి ఉన్నాడు. కసనూరు పరమేశ్వర్ రెడ్డికి బాగా పరిచయస్తుడు కావడంతో ఇతని ప్రాత్రపై సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే వివేకాకు సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, డ్రైవర్‌ ప్రసాద్‌తో సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని 5రోజులుగా సిట్‌ విచారిస్తోంది.

ఈక్రమంలోనే వివేకా హత్య వెనుక సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామానికి చెందిన పరమేశ్వరరెడ్డి ప్రమేయం ఉన్నట్టు విచారణలో తేలినట్లు సమాచారం. అటు బెంగళూరులో రూ.వందల కోట్లు విలువ చేసే స్థిరాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించాలంటూ అదుపులో ఉన్న ఎర్ర గంగిరెడ్డిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Related News