Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పర్చూరు మండలంలో కలకలం... వైసీపీ ప్రచారంలో తెలంగాణ యువత..

Category : state politics

తెలంగాణకు చెందిన కొందరు యువకులు ఏపీలో వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ స్టిక్కర్లు అంటిస్తున్నారు. వీరిని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పర్చూరులో ఆదివారం వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

ప్రకాశం జిల్లా పర్చూరు మండలంలోని పెద్దివారిపాలెంలో తెలంగాణకు చెందిన కొందరు యువకులు ఇంటింటికీ తిరిగి వైసీపీ స్టిక్కర్లు అంటిస్తున్నారు. దీంతో గ్రామంలో కలకలం రేగింది. తమ అనుమతి లేకుండా స్టిక్కర్లు ఎందుకు అంటిస్తున్నారు? అసలు మీరెవరు? అని ఆ యువకులను స్థానికులు నిలదీశారు.

దీంతో వారు తాము తెలంగాణకు చెందిన వారిమని చెప్పడంతో బదులిచ్చారు. దీంతో స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యువకులను విచారించి అనంతరం విడిచి పెట్టారు.

Related News