//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

130 స్థానాల్లో టీడీపీ గెలుస్తుంది.. రెండో ఆలోచన లేదు : సీఎం చంద్రబాబు

Category : state politics

మళ్లీ టీడీపీదే అధికారం అని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నూటికి నూరు శాతం టీడీపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నికలు ముగిసిన తరువాత అర్ధరాత్రి టీడీపీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ప్రాథమిక సమాచారం ప్రకారం 130 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందన్నారు. ఇందులో రెండో ఆలోచనలేదని స్పష్టం చేశారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.

అర్ధరాత్రి వరకు పోలింగ్‌ బూత్‌లలో విధులు నిర్వహించిన ఏజెంట్లకు అభినందనలు తెలిపారు. కౌంటింగ్‌ వరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలన్నారు..ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండాలన్నారు. స్ట్రాంగ్‌ రూంల దగ్గర.. 40 రోజులు షిఫ్టుల వారీగా కాపలా కాయాలన్నారు. ఫలితాల వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఓడిపోతున్నామనే ఫ్రస్టేషన్‌తో వైసీపీ పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించాలని చూసినా ప్రజలు టీడీపీ పక్షానే నిలిచారని ఆనందం వ్యక్తం చేశారు.

Related News