Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేసులుంటే మాట్లాడ‌మ‌న్న ఈసీ ...తీవ్ర స్థాయిలో మండి పడ్డ టీడీపీ..

Category : state politics

తాజాగా జరిగిన ఏపీ ఎన్నిక‌లు స‌రిగా జ‌ర‌గ‌లేదంటూ ,దానిపై మాకు చాలా అనుమానాలు ఉన్నాయ‌ని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు ఢిల్లీ లోని కేంద్ర అధికార ప్ర‌తినిధిని క‌లిసారు. ఈ నేప‌థ్యంలో ఈవీఎంలా టాప‌రింగ్ జ‌రిగింద‌నే అనుమానాలు ఉన్నాయ‌ని ,మా టెక్నిక‌ల్ అధికారి హ‌రిప్ర‌సాద్ సంధేహాలు తీర్చాల‌ని చంద్ర‌బాబు ఆ అధికారిని కారారు .

దీనిపై సానుకూలంగా స్పందించిన ఈసీ ఈ నెల 15 హాజ‌ర్ కావాల‌ని చెప్పింది .కానీ .. హ‌రిప్ర‌సాద్ పై కేసులు ఉన్న నేప‌థ్యంలో అత‌నితో మేము సంప్ర‌దింపులు జ‌ర‌ప‌మ‌ని చెప్పాడంతో పాటు ,అత‌ని స్థానంలో ఇంకో వ్య‌క్తిని పంపిస్తే స‌మాధానాలు చెపుతామంటూ ఈసీ ఒక లేఖ‌ను తెలుగుదేశం పార్టీకి పంపించింది.దీనిపై తెలుగు దేశం పార్టీ నేత‌లు స్పందిస్తూ .... అభ్య‌ర్థుల‌పై ఎన్ని కేసులు ఉన్న ఎన్నిక‌ల‌లో నిలబ‌డ‌వ‌చ్చ‌ని ఈసీ వారికి అనుమ‌తినివ్వ‌గా ,హ‌రిప్ర‌సాద్ ఎందుకు అనుమ‌తినివ్వ‌దంటూ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

ఇందంతా చూస్తుంటే కేంద్రం ఆడిస్తున్న ఆట‌కు ఈసీ వంత పాడుతున్న‌ట్లుగా ఉంద‌ని,దేశంలో ప్ర‌జాస్వామ్యం కూని అయింద‌ని టీడీపీ శ్రేణులు అంటున్నారు.ఏదేమైనా కానీ ...ఒక అత్యున్న‌త స్థానంలో ఉన్న ఈసీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే దిశ‌గా అడుగులు వేయాలి కానీ ...స‌మ‌స్య‌ను పెద్ద‌ది చేసే దిశ‌గా అడుగులు వేయ‌డం మంచిది కాద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

Related News