Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్నారైలకు షాకింగ్ ఆదేశాలు

Category : national world

ఎన్నారైలు చేసుకున్న వివాహాలను 48 గంటల్లోగా రిజిస్టరు చేయించుకోకుంటే వారి పాస్ పోర్టు, వీసాలను జారీ చేయమని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మనేకాగాంధీ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నారైల వివాహాలను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ డాటాబేస్ లో ఉంచుతామని మనేకాగాంధీ ప్రకటించారు. ఎన్నారైలతో ఏర్పడుతున్న వివాహ వివాదాలను పరిష్కరించేందుకు ఈ చర్యలు తీసుకున్నామని మంత్రి చెప్పారు.

ఎన్నారైల వివాహ వివాదాలపై తాము ఆరు లుక్ అవుట్ సర్కులర్లను జారీ చేశామని, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వార మరో ఐదుగురు ఎన్నారైల పాస్ పోర్టులను రద్దు చేశామని మనేకాగాంధి పేర్కొన్నారు. గతంలో లా కమిషన్ నివేదికలో చేసిన సిఫార్సుల మేర ఎన్నారైల వివాహాలను పెళ్లి చేసుకున్న 30 రోజుల్లోగా రిజిస్టరు చేసుకోవాలని కోరారు. 30 రోజులు దాటితే రోజుకు ఐదు రూపాయల చొప్పున జరిమానాను వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

Related News