Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నందమూరి అభిమానులకు షాకింగ్ న్యూస్ మోక్షజ్ఞ ఎంట్రీ ఇక లేనట్టేనా ఫ్యాన్స్ లో డౌట్....!

Category : movies

నందమూరి బాలయ్య అభిమానులకు ఇది కచ్చితంగా హార్ట్ బ్రేకింగ్ న్యూస్. నందమూరి వంశంలో మూడోతరం హీరోగా మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఎప్పుడెప్పుడా....? అని ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు షాకింగ్ న్యూస్. నందమూరి మోక్షజ్ఞ సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపడం లేదనేది ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న హాట్ న్యూస్‌. మోక్షజ్ఞ సినిమా ఎప్పుడు ఉంటుంది...? ఏ దర్శకుడి తో ఉంటుంది? అంటూ గత కొంత కాలంగా ఆయన ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. నందమూరి బాలయ్య స్వయంగా మెగా ఫోన్ పట్టి కొడుకుని ఎప్పుడు తెరంగేట్రం చేస్తారనే చర్చ కూడా జరిగింది. నటనలో మెళకువల కోసం మోక్షజ్ఞకు స్పెషల్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారని.. అందుకే అతడి ఎంట్రీ కి కొంత ఆలస్యం అవుతోందనే ప్రచారం కూడా ఇన్నాళ్లూ జరిగింది. అయితే, ఇప్పుడు తాజాగా చూస్తే అసలు మోక్షజ్ఞకు సినిమాల్లోకి రావడమే ఇష్టం లేదని,అతనికి సినిమాల్లో నటించడం కంటెను వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంలో నే ఆసక్తిగా ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ విషయం ఎంత వరకు నిజం అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే గతంలోనూ నందమూరి బాలయ్య వందో సినిమా అయిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలోనే బాలయ్య తనయుడు ఉంటారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్‌లో చిన్నప్పటి బాలయ్యగా మోక్షజ్ఞ నటిస్తున్నారనే వార్తలు వచ్చాయి. అవన్నీ నిజం కాదని, ఆ సినిమాలు రిలీజ్ అయ్యాక తెలిసిపోయింది. అంతే కాకుండా గత కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. తాను మోక్షజ్ఞను ఓ కథా బలం ఉన్న సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తున్నానని, పెద్ద పెద్ద ఫైటింగ్‌లు చేసేసి.. ప్రపంచాన్ని కాపాడే హీరో రేంజ్‌లో తెరంగేట్రం చేయబో డని ఆయన ప్రకటించారు. అంటే, బాలయ్య మదిలో మోక్షజ్ఞను సూపర్ హీరో కంటే ను పంచి నటుడిగానే చూడాలి ఉన్నట్టు అర్థం అవుతోంది.అయితే ఇప్పటికే మోక్షజ్ఞ వయసు 24 ఏళ్లు. చాలా వరకు మన చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల వారసులు ఈ ఏజ్ లోపే తెరంగేట్రం చేశారు.మరి మోక్షజ్ఞ యెపుడు ఎంట్రీ అన్నది ఇంకా వేచి చూడాలి.

Related News