Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీలో బీజేపీ కి షాక్ ... జనసేన బాట పట్టనున్న కీలక ఎమ్మెల్యే రాజీనామా

Category : state politics

ఏపీలో బీజేపీ నాయకులు ఆ పార్టీ కి వరుస షాకులు ఇస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేసిందని భావిస్తున్న తరుణంలో ప్రజల్లో బీజేపీ పై విశ్వాసం పూర్తిగా పోయింది. రానున్న ఎన్నికల నేపధ్యంలో బీజేపీ నుండి పోటీ చేస్తే గెలుపు సాధ్యం కాదని భావిస్తున్న నేతలు వలసబాట పట్టారు. ఇప్పటికే విష్ణు కుమార్ రాజు వంటి ముఖ్యనాయకులు పార్టీ మారుతున్న నేపధ్యంలో తాజాగా మరో నేత పార్టీ కి గుడ్ బై చెప్పారు. బీజేపీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఏపీలో పార్టీ మనుగడ కోల్పోతుంది అని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీని వీడి బయటకు వస్తున్నారు.

ఏపీలో గత ఎన్నికల సమయంలో అంతో ఇంతో ప్రాధాన్యం ఉన్న పార్టీ అధిష్టాన నిర్ణయాల వల్ల అభాసు పాలయ్యింది. ఏపీలో పూర్తిగా మనుగడ కోల్పోయే స్థితికి చేరుకుంది. అందుకే ఇక ఆ పార్టీ సైతం తమ నాయకులు పోటీ చేస్తే గెలవరు అని భావిస్తున్న తరుణంలో టీడీపీ ని ఓడించి వైసీపీ కి అధికారం దక్కేలా పని చెయ్యాలని అధిష్టానం సూచన చేసింది.

గత ఎన్నికల్లో గెలిచి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న నాయకులు తాము గెలిచే అవకాశం ఉన్న పార్టీల్లో చేరాలని భావిస్తున్నారు. అందులో భాగం గానే ఏపీలో బీజేపీకి మరో ఊహించిన షాక్ తగిలింది. సీనియర్ నేత ఒకరు పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తులలో భాగంగా రాజమండ్రి అర్బన్ నుండి పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీని వీడి జనసేనకు జై కొట్టనున్నారు . ఆకుల సత్యన్నారాయణ పార్టీ మారే క్రమంలో భాగం గా ప్రధాన పార్టీల నుండి అవకాశం ఉందేమో చూసుకున్నారు. టీడీపీ, వైసీపీ ల నుండి రాజమండ్రి అర్బన్ కు టికెట్ అవకాశం లేకపోవటం థ్ జనసేనాని పంచన చేరేందుకు సిద్ధం అయ్యారు. బీజేపీ ని వీడి జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నఆయన సోమవారం ఆయన పార్టీకి రాజీనామా చేశారు.

ఇక తన రాజీనామా లేఖను ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాని కలిసి.. ఆయనకు సమర్పించనున్నట్లు ఆకుల సత్యనారాయణ చెప్పారు. రాజీనామా లేఖను అందించటానికి ఆయన ఢిల్లీ వెళ్ళారు. ఇక బీజేపీ కి రాజీనామా చేసిన అనంతరం ఆయన జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. కమలాన్ని వదిలి గాజు గ్లాస్ పట్టుకోనున్న ఆకుల ఎన్నికల సమయంలో బీజేపీ కి షాక్ ఇచ్చారు. ఈ విషయంపై ఇప్పటికే ఆకుల సత్యన్నారాయణ పవన్ తో చర్చలు జరిపారు. పవన్ సైతం కాలు సత్యన్నారయనకు టికెట్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో ఆకుల సత్యనారాయణ అధికారికంగా జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం . మొత్తానికి ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్న బీజేపీ కి రానున్న ఎన్నికల్లో అభ్యర్థులు కరువయ్యే పరిస్థితి వస్తుందేమో అన్న చర్చ జోరుగా సాగుతుంది.

Related News