//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పరిటాల రవి స్ఫూర్తిగా అరవింద సమేత చిత్రం....అందరికి షాకింగ్ న్యూస్..

Category : movies

యుద్ధం గెలిచేవాడు వీరుడు కాదు...యుద్ధాన్ని ఆపేవాడే అసలైన విజయోత్తముడు వీరుడు....యుద్ధాన్ని కొనసాగిస్తూ ఆధిపత్యం చెలాయిస్తూ పబ్బం గడుపుకుని వీరుడిలా విర్రవీగేవారు మన సీమలో చాలామందే వున్నారు...ఇది ఎందుకు చెబుతున్నానంటే...

ఈ రోజు జూనియర్ ఎన్టీ ఆర్ నటించిన అరవిందసమేత వీరరాఘవ సినిమా నేను మొదటి ఆట చూశాను...డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఎవ్వరిని స్ఫూర్తిగా తీసుకుని సినిమాని తీశారో నాకు తెలియదు కానీ...నాకు మాత్రం ఆచిత్రంలోని ప్రతి ఫ్రేమ్ లోను నేను అమితంగా అభిమానించే అనంతకు చెందిన ఒక రియల్ హీరో నాకు కనిపించాడు...

రెండు వర్గాలు మద్య కావచ్చు ఇద్దరు వ్యక్తుల మద్య కావచ్చు...జరిగుతున్న పోరు ఆపాలంటే బలవంతుని వల్లనే సాధ్యం అవుతుంది...బలహీనుడే పోరు సాగించడం ద్వారా బలాన్ని చాటుకోవాలనుకుంటాడు... పోరు ఆపాలనుకుంటే మాత్రం అది బలవంతుడితోనే జరుగుతుంది...అటువంటి పరిస్థితులు నేను అనంతపురం జిల్లాలో స్వయంగా చూశాను...యుద్ధాలను ఆపిన బలవంతున్ని చూశాను... ఆయన ఇప్పుడు మన కళ్లముందు లేకపోయినా తరాలు మారినా మరవలేని మహోన్నతుడు..ఆ బలవంతుడు ఎవ్వరన్నది ఇప్పటికే అర్థం అయ్యే వుంటది...

ఇక అరవింద సమేత వీర రాఘవ సినిమా విషయానికి వస్తే అందులో యుద్ధం జరిగాక...వెంటాడే బాధలను కక్షల కుంపట్లను...యుద్ధంలో అసువులు బాసిన కుటుంబాల్లోని మహిళల కష్టాలను త్రివిక్రమ్ కళ్లకు కట్టినట్లు చూపించాడు...ఏముంది ఇక్కడ బొట్టుపెట్టడానికి ఒక ముత్తైదువ లేదన్నట్లుగా సినిమాలోని ఓక్యారెక్టర్ పడ్డ వేదన...నా మొగుడు జైల్లో వుంటే నా కడుపున పుట్టిన బిడ్డను మిలాఖత్ లో అయినా చూపుతానంటూ గర్భవతిగా వున్న ఓమహిళ చెప్పిన డైలాగ్ గుండెల్లో ఎక్కడో చివుక్కుమంటుంది...

మొత్తం మీద సీమ చరిత్ర అంటే ఫ్యాక్షనే కాదు...దాంతో నష్టపోయిన బాధిత కుటుంబాల కష్టాలు ఎలా వుంటాయో ఫ్యాక్షన్ కి ఎలా అడ్డుకట్ట వేయాలో అది ఎవ్వరితో సాధ్యం అవుతుందో కేవలం మూడుగంటల్లో చూపించి ఫ్యాక్షన్ పై సందేశాత్మక చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి ఒక కనువిప్పు కల్గించిన త్రివిక్రమ్ గారికి అందులో లీనమై సరికొత్తగా కనిపించిన వీరరాఘవుడు నందమూరి తారకరాముడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ....