హసీన్ జహాన్ అరెస్టుతో మరోసారి షమీ.. జహాన్ల గొడవ తెరమీదకు వచ్చింది. కొన్ని నెలలుగా భర్త షమీపై ఆరోపణలు గుప్పిస్తూ వివాదం రేపింది. ఈ క్రమంలో యువతిని ఏప్రిల్ 28వ ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఒక్క వారెంట్ కూడా జారీ చేయకుండానే అరెస్టు చేశారు. సెక్షన్ 151 ప్రకారం.. పోలీసులు ఇలా అరెస్టు చేసే అవకాశం ఉంది. ఆదివారం రాత్రి జహాన్.. తన కూతురు బెబోను తీసుకుని ఇంట్లోకి చొరబడింది. ఇంట్లో ఉన్న వారిపై వాదనకు దిగి నానా రచ్చ చేసింది. అదుపు చేయలేని క్రమంలో వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు షమీ భార్యను అరెస్టు చేశారు. దాదాపు ఏడాది కాలంగా షమీ లైంగిక వేధింపులుకు పాల్పడుతున్నాడంటూ ఆరోపణలు చేసింది.
దీని కారణంగా, షమీపై బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్(బీసీసీఐ)షమీ పేరిట ఉన్న కాంట్రాక్టులను కూడా రద్దు చేసింది. ప్రస్తుతం షమీ ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్లో ఫేసర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 11మ్యాచ్ల్లో 14వికెట్లు పడగొట్టి కీలక బౌలర్గా నిలిచాడు. పంజాబ్ ఆడిన 11మ్యాచ్లలో 5మాత్రమే గెలిచింది.