//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంగ్రెస్‌కు ఝ‌ల‌కిస్తున్న కొండా దంప‌తులు..!

Category : state politics

తెలంగాణ కాంగ్రెస్‌కు వ‌రంగ‌ల్ జిల్లా నేత‌లు కొండా ముర‌ళీధ‌ర్‌రావు, కొండా సురేఖ ఝ‌ల‌కివ్వ‌బోతున్నారా? అంటే జ‌రుగుతున్న ప‌రిణామాలు నిజ‌మ‌నే స‌మాధానం చెబుతున్నాయి. వ‌రంగ‌ల్‌, న‌ల్ల‌గొండ‌, రంగారెడ్డి జిల్లాల స్థానికి ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో వాటికి దూరంగా వుండాల‌ని కొండా దంప‌తులు నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఐదేళ్ల క్రితం తెరాస‌లో చేరిన ఈ దంప‌తులు ఆ త‌రువాత జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన విష‌యం తెలిసిందే.తెరాస నుంచి ఎమ్మెల్సీగా ఎంపికైన కొండా ముర‌ళి ఆ త‌రువాత త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇప్పుడు అదే స్థానానికి త్వ‌ర‌లో ఎన్నిక జ‌ర‌గ‌బోతోంది. ఈ స్థానం నుంచి తెరాస పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డిని రంగంలోకి దింపింది.

కొండా ముర‌ళి కాంగ్రెస్ త‌రుపున పోటీకి విముఖ‌త చూప‌డంతో ఆ స్థానంలో ప‌ర‌కాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వెంక‌ట‌రామిరెడ్డిని ఖ‌రారు చేశారు. 14తో నామినేష‌న్‌ల గ‌డుపు పూర్తికానుండ‌టంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ పెద్ద‌లు వెంక‌ట‌రామిరెడ్డిని ఫైన‌ల్ చేశారు. కానీ వెంట‌క‌రామిరెడ్డి గెల‌వ‌డం అంత ఈజీ కాదంటున్నారు. కొండా దంప‌తుల‌తో పాటు స్థానిక కాంగ్రెస్ నేత‌లు కూడా స‌హ‌క‌రించ‌డానికి విముఖ‌త చూప‌డ‌మే ఇందుకు కార‌ణంగా క‌నిపిస్తోంది.