Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీలోకి చేరిన కొణతాల....?

Category : state politics

ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్‌ కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరనున్నట్టు తెలిసింది. రెండురోజులుగా ఆయన అనకాపల్లిలోని తన కార్యాలయంలో అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.

గురువారం కశింకోట మండల నాయకులతో సమావేశమైనట్టు సమాచారం. కొణతాల వర్గీయుడైన ఒక మాజీ సర్పంచ్‌ మాత్రం స్థానిక టీడీపీ నాయకులతో సర్దుకుపోలేనని, వైసీపీలోకి వెళతానని చెప్పినట్టు తెలిసింది. మిగిలినవారంతా పార్టీలో చేరినా వెంట ఉంటామని చెప్పారని, టీడీపీలో చేరాలని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొణతాల రామకృష్ణ అతి త్వరలో టీడీపీలో చేరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Related News