//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కరివేపాకే కదా అని పారేస్తున్నారా ? దాని పోషక విలువలు తెలిస్తే ఆ పని చెయ్యరు

Category : health

కూరలో కరివేపాకు కదా అని అంత ఈజీ గా తీసి పక్కన పడేయకండి. దానిలో ఉన్న పోషకాలు తెలిస్తే కరివేపాకు కోసం పరుగులు పెట్టడం ఖాయం. అంతటి పోషక విలువలు, మన ఆరోగ్యాన్ని సంరక్షించే ఎన్నో గుణాలు కరివేపాకు లో ఉన్నాయి. కేవలం వంటల్లో వాసన కోసమే కరివేపాకు వినియోగిస్తారు అని భావిస్తే తప్పులో కాలేసినట్టే. మన ఆహార పదార్థాల్లో కరివేపాకును కూడా భాగం చేయడంలో ఉద్దేశం దానిని సైతం మనం తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే.

ప్రతి ఇంట్లోనూ తమ వంటల్లో కరివేపాకును ఏదో ఒక సందర్భంలో తప్పకుండా వాడతారు. కరివేపాకు వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అనేక కూరలు, రైస్ ఐటమ్స్, స్నాక్స్‌లలో కరివేపాకు వేస్తే వచ్చే మజాయే వేరు. అంతేకాకుండా మనకు పలు ఆరోగ్యకర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మరి కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, కరివేపాకు వల్ల మన ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవచ్చు అంటే..

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా వీటిలో ఉంటాయి. అందువల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. జ్వరం, శ్వాసకోశ సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. కాలిన గాయాలు, దురదలు, వాపులు, దెబ్బలు తదితర వాటిపై కరివేపాకు అమోఘంగా పనిచేస్తుంది. కొన్ని కరివేపాకులను తీసుకుని పేస్ట్‌లా చేసి వాటిపై రాసి కట్టు కట్టాలి. దీంతో ఆయా సమస్యలు తగ్గుముఖం పడతాయి. కరివేపాకులో యాంటీ సెప్టిక్ గుణాలు ఉండడం వల్ల ఎలాంటి గాయం అయినా, చర్మ సమస్యలు అయినా ఇట్టే తగ్గుతాయి.

అధిక బరువును తగ్గించడంలోనూ కరివేపాకు ఎంతగానో మేలు చేస్తుంది. నిత్యం భోజనానికి ముందు కొన్ని కరివేపాలకు అలాగే నమిలి తింటే శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు.

కరివేపాకులో ఐరన్, జింక్, కాపర్ తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి క్లోమ గ్రంథిని ఉత్తేజితం చేస్తాయి. దీంతో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తుంది. ఫలితంగా వారి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.జ్ఞాపశక్తి తక్కువగా ఉందని భావించేవారు, మతిమరుపు ఉన్నవారు నిత్యం కరివేపాకులను తింటుంటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. కంటిచూపును మెరుగు పరచడంలో, చర్మాన్ని, శిరోజాలను రక్షించడంలో కరివేపాకు అమోఘంగా పనిచేస్తుంది. కరివేపాకులో ఉన్న విటమిన్ ఎ కంటి సమస్యలను పోగొడుతుంది. దృష్టి పెరిగేలా చేస్తుంది. కళ్లలో శుక్లాలు రాకుండా ఉంటాయి.కరివేపాకు జీర్ణ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. వికారం, వాంతులు వచ్చినట్లు ఉంటే కరివేపాకును ఆహారంలో తీసుకోవాలి. దీంతో ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకేం ఇది తెలుసుకున్న తర్వాత అయినా కరివేపాకే కదా అని పక్కన పడేయకండి. ప్రతి రోజూ కరివేపాకును తిని ఆరోగ్యంగా ఉండండి.