Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జ‌గ‌న్ పై దేవినేని ఉమా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు .....?

Category : state politics

ప్ర‌స్తుత ఎన్నిక‌ల తీరును తప్పుబ‌డుతూ .... టీడీపీ నాయ‌కుడు దేవినేని ఉమా ఒక మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా దేవినేని మాట్లాడుతూ.....జ‌గ‌న్ ఓడిపోతార‌నే భ‌యంతోనే ఇత‌ర పార్టీల‌తో జ‌త‌క‌ట్టాడ‌ని ,ఏపీలో రాత్రులు ఎన్నిక‌లు జ‌రితే వాటి గురించి మాట్లాడ‌కుండా తెర వెన‌క మంత‌నాలు జ‌రుపుతున్నార‌ని ఎద్దేవ చేశారు.

పోలింగ్ స‌జావుగానే సాగిందంటున్న జ‌గ‌న్ ఇంబ్ర‌హీం ప‌ట్నంలో తెల్ల‌వారుజాము వ‌ర‌కు పోలింగ్ ఎందుకు నిర్వ‌హించార‌ని ,దాని పై మీరెందుకు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌రంటూ దేవినేని చెప్పుకొచ్చారు.జ‌గ‌న్ త‌ప్పుడు స‌మాచారంలో ఈసీ మా అధికారుల‌ను బ‌దిలీ చేయ‌డం ఎంట‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి చ‌ర్య ఏ రాష్ట్ర రాజ‌కీయాల‌లో జ‌ర‌గ‌లేద‌ని ,ఇదంతా జ‌గ‌న్ ఓట‌మి కార‌ణంగానే బ‌య‌టి శ‌క్తుల‌దో పొత్తుకు సిద్ధ‌మైయ్యార‌ని దేవినేని మీడియా స‌మావేశంలో అన్నారు.

మేము ఫిర్యాదులు చేస్తే ప‌ట్టించుకోని అధికారులు ,జ‌గ‌న్ ఫిర్యాదు చేస్తే ఎందుకు ప‌ట్టించుకుంట్టున్నారని ,ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రాన్ని నిల‌దీసినందుకే బీజేపీ ఇదంతా వెనుకుండి చేయిస్తుంద‌ని ,వాళ్లేన్ని కుట్ర‌లు చేసిన ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత గెలిచేది మేమేన‌ని అందులో ఎలాంటి సందేహం లేదంటూ దేవినేని మిడియా స‌మావేశంలో స్ప‌ష్టం చేశారు.