Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేంద్రంలో అధికారం కాంగ్రెస్ దే… తెరాస ఎటువైపు…?

Category : state politics

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలో అధికారం చేపట్టబోయేది కాంగ్రెస్ అని, కాంగ్రెస్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అజారుద్దీన్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు… ఇన్ని ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటిని ప్రధాని మోడీ దేశానికి, ప్రజలకు చేసింది ఏమి లేదని, మోడీ రాహుల్ గాంధీ ని విమర్శించడానికి పెట్టిన శ్రద్ధ అభివృద్ధిపై కాస్తైనా పెట్టి ఉంటె మనదేశం ఎప్పుడో బాగు పడేదని అజారుద్దీన్ అన్నారు. అంతేకాకుండా ఉద్యోగాలపై గతంలో మాట్లాడిన మోడీ తరువాత వాటిని అసలే పట్టించుకోలేదని విమర్శించారు.అయితే కేంద్రంలో యూపీఏ అదికారంలోకి రావాలంటే వారికి తెరాస మద్దతు తప్పని సరి అని కెసిఆర్ పలికిన మాటలపై స్పందించిన అజారుద్దీన్…

ఒకవేళ యూపీఏకు టీఆర్ఎస్ మద్దతు అవసరమైతే ఆ విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల అంబర్ పేట్ మజీద్ స్థలం వివాదంపై మాట్లాడుతూ, మజీద్‌ను జీహెచ్ఎంసీ అక్రమంగా కూల్చేసిందని, కావాలనే కక్షతోనే కూల్చేశారని, మజీద్‌కి కనీస గౌరవం కూడా ఇవ్వలేదని అజారుద్దీన్ మండిపడ్డారు. దీనికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని అజారుద్దీన్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా నష్ట పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుందాం అని అనుకుంటున్న అధికారులు, ఎంతవరకు ఇలా చేస్తారని తప్పుబట్టారు…

Related News