Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పవన్ కళ్యాణ్ కు ఆలీ కౌంటర్

Category : state politics

పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో కామెంట్ చేశారు. నేను పుట్టింది, పెరిగింది రాజమండ్రి. నేను పుట్టిన గడ్డకు నా తండ్రి పేరున ట్రస్ట్ పెట్టుకొని కులమతాలకు అతీతంగా సేవ చేస్తున్నా. రాజమండ్రిలో పవన్ వ్యాఖ్యలు నన్ను బాధించాయి.పవన్ చుట్టుప్రక్కల ఉన్నవారు ఆలీ మీద వ్యాఖ్యలు చేయమంటే మీరు చేసి ఉంటారు. మీరు చిరంజీవి వేసిన బాటలో మీరు వచ్చారు. కానీ నేను నా బాట వేసుకొని పైకి వచ్చాను.నేను వైయస్సార్ సీపీ ప్రచారం కోసం చాలా జిల్లాలో చేశాను. నేను మీ స్థానం గుండెల్లో పెట్టుకున్నాను. పవన్ గారు మీరు ఎప్పుడూ బావుండాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి లైన్ లో మొదటి వ్యక్తిని నేను.

ఆలీ కష్టాల్లో ఉన్నప్పుడు సాయపడ్డాను అని పవన్ అన్నారు. మీరు ఏ విధంగా సాయపడ్డారు పవన్ సర్. అంటే ధనం ఏమైనా ఇచ్చారా? నాకు ఏమైన సినిమాలు చెప్పారా? సినిమాలు లేక ఇంట్లో ఉంటే తీసుకెళ్లి అవకాశాలు ఇప్పించారా? సర్.. మీరు ఇండస్ట్రీలోకి రాకమునుపు నుంచి నేను ఒక మంచి పొజిషన్ లో ఉన్నాను సర్. నేను ఎవ్వరి దగ్గరా అయ్యా నేను కష్టాల్లో ఉన్నాను. రూపాయి సాయం చేయమని ఏనాడూ ఎవ్వరి దగ్గరా అడగలేదు. అల్లా దయవల్ల చాలా బాగున్నాను. ఇంకా అడిగే అవకాశం వస్తే అప్పటికి ఆలీ ఉండడు. వెళ్లను కూడా. ఆకలితో చచ్చిపోతాను తప్ప వెళ్లి అమ్మా.. దేహీ అనే స్థితికి వెళ్లను. మీకు తెల్సు నేను కుటుంబాన్ని ఎలా చూసుకుంటానో. నేను ఎవ్వర్ని మనసు బాధపడేలా ఇంతముక్క చెప్పను. మీరు రాజమండ్రిలో విమర్శ చేయటం సరికాదు. వైయస్సార్ సీపీలో వెళ్లటం తప్పేంటి? అదేమైన నేరమా? రాజ్యాంగంలో రాసుందా అక్కడకు వెళ్లకూడదని. నాకు స్వేచ్ఛ లేదా? మీ గురించి నేను వ్యాఖ్యానిస్తే మీరు నాగురించి కామెంట్ చేయాలి. రాజమండ్రిలో మీరు కామెంట్ చేయటం సరికాదు.

మీరు నా చుట్టానికి టిక్కెట్ ఇచ్చానని పవన్ అంటున్నారు. నేను మిమ్మల్ని వచ్చి అడిగానా? పోనీ ఇచ్చే ముందు నన్ను అడిగారా, అదెలా చెబుతారు సర్. నా నెంబర్ మీ దగ్గర ఉంది. 12- 14 ఏళ్లు నుంచి ఒకే నెంబర్ మెయింటైన్ చేస్తున్నాను. పార్టీలోకి రమ్మను పవన్ ఎప్పుడైనా అడిగారా? అడగనప్పుడు ఇంత పెద్ద కామెంట్ చేయటం ఎందుకు? అని ఆలీ ఆవేదన వ్యక్తం చేశారు.ఆలీ కి ఉన్న హుందాతనం కూడా పవన్ కి లేదు

Related News