Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త కోణాలు

Category : state politics

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో విస్తుగొలిపే అంశాలు వెల్లడించారు. గుండెపోటుతో చనిపోయి ఉంటారని చెప్పింది ఎర్రగంగిరెడ్డే అని.. నిందితుల వాంగ్మూల రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు.

గంగిరెడ్డి ఆదేశాల మేరకే లక్ష్మి, రాజశేఖర్‌ బెడ్‌రూంలో రక్తపు మరకలు తుడిచారని తెలిపారు. తర్వాత గంగిరెడ్డి, ఇనాయతుల్లా, ట్యాంకర్‌ బాషా, రాజశేఖర్‌తో కలిసి వివేకానందరెడ్డి బాడీని బాత్‌రూంలో నుంచి బెడ్‌రూంలోకి తెచ్చారని పులివెందుల కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు పోలీసులు.

అటు వివేకా హత్యకేసులో సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగంపై ఎర్రగంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్‌ అనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు కస్టడీ ముగియడంతో ముగ్గురినీ పులివెందుల కోర్టులో హాజరు పరిచారు. దీంతో మరో 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగించింది కోర్టు.