//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

Category : politics

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత ప్రస్తుతం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర లో చాలా బిజీగా ఉన్నాడు. రాష్ట్రం మొత్తం పాద‌యాత్ర‌ చేయాలనీ పూనుకొని ఆ విధంగా కొనసాగుతున్నాడు , కానీ ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు వ‌రుస‌గా షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. పాద‌యాత్ర వేళ వైసీపీకి చెందిన నేత‌లు ఒక్కొక్క‌రు వ‌రుస‌గా జ‌గ‌న్‌కు గుడ్‌బై చెబుతున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర మొద‌లైన త‌ర్వాత వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వ‌ల‌స‌లు పెరిగిపోవ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.

గ‌త ఎన్నిక‌ల్లో కొద్దీ తేడా తో అధికారాన్ని కోల్పోయినవైసీపీ , ఈసారి ఎలా అయిన సీఎం కుర్చీని అందుకోవాలని అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ర‌మావ‌ధిగా అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఓడిపోతే పార్టీ ఉనికికే ప్ర‌మాదమ‌ని గ్ర‌హించిన ఆయ‌న‌, రాబోయే ఎన్నిక‌ల్లో అధికారాన్ని ద‌క్కించుకునేందుకు శత‌విధాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ మేర‌కు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టిన జ‌గ‌న్‌, ముందుగానే ప్ర‌కటించిన న‌వ‌ర‌త్న ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లో తీసుకెళ్ల‌డంతో పాటు, ఎన్నిక‌ల హామీల‌ను ప్రకటిస్తూ ముందుకు పోతున్నారు. మ‌రోవైపు పాద‌యాత్ర ద్వారా పార్టీని క్షేత్ర‌స్ధాయిలో బలోపేతం చేసేందుకు జగన్ తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇక నేతలు పార్టీ లు మారడానికి ముఖ్య కారణం జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో పాటు ఆయ‌న వ్య‌వ‌హారిస్తున్న తీరు అని అందరూ చెప్తున్నారు. అంతేకాకుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ గెల‌వ‌డం క‌ష్ట‌మేన‌ని వివిధ స‌ర్వేలు వెల్ల‌డిస్తుండ‌టం కూడా ఆ పార్టీకి చెందిన నేత‌లు ఇత‌ర పార్టీల్లో చేర‌డానికి మ‌రో కార‌ణం.

తాజాగా ఇప్పుడు మ‌రో మాజీ ఎమ్మెల్సీ వైసీపీకి గుడ్‌బై చెప్ప‌నున్నారు.తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేశ్ వైసీపీని వీడ‌నున్న‌ట్లు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఆయ‌న జ‌న‌సేన‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న‌ట్లు సమాచారం. ప్రస్తుతం వైసీపీ గ్రేటర్‌ రాజమహేంద్రవరం కో-ఆర్డినేటర్‌గా ఆయ‌న ఉన్నారు. అయితే ఇటీవ‌ల కాపు రిజ‌ర్వేష‌న్ల‌తో పాటు ప‌వ‌న్ పెళ్లిళ్ల‌పై జ‌గ‌న్ దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేయ‌డంతో జిల్లాలోని కాపు నేత‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. అందులో భాగంగానే వైసీపీని వీడాల‌ని నిర్ణ‌యించుకున్న ఆయ‌న‌, వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నట్లు స‌మాచారం.ఇటీవ‌ల వైసీపీకి చెందిన కాపు నేత‌లు ఒక్కొక్క‌రు ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఈ ప‌రిణామ‌ల‌తో గోదావ‌రి జిల్లాల‌లో వైసీపీ మ‌రింత బ‌ల‌హీన‌ప‌డ‌నుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.