Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంగ్రెస్ లో కలకలం ..ఉత్తమ్ రాజీనామా చేయనున్నాడా…?

Category : state politics

కాంగ్రెస్ లో అందరు కూడా కాస్త అయోమయంలో పడ్డారు. దానికి కారణం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నాడు. ప్రస్తుతానికి ఈ వార్త కాంగ్రెస్ నేతలందరినీ కూడా కలవరపెడుతుంది. మరో రెండు రోజుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నాడు. అంతేకాకుండా నేడు గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు మధ్య జరిగినటువంటి ఆసక్తికరమైన సంభాషణ ఇపుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

వారిరువురి మాటలను బట్టి చూస్తే ఈ వార్తలు నిజమనే వాదన కలుగుతుంది. అయితే నేడు గాంధీభవన్‌లో ఉత్తమ్, శ్రీధర్‌బాబు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఇప్పటినుండి బీఫామ్‌లు ఇచ్చేది నువ్వే కదా అని శ్రీధర్‌బాబుతో ఉత్తమ్ అంటే, ఇకనుండి బీ ఫామ్‌లు పంపేది నువ్వే కదా అంటూ సరదాగా మాట్లాడుకున్నారు…అంటే ఉత్తమ్‌కు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వనున్నారని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని, అందుకనే ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రస్తుత పదవికి రాజీనామా చేయనున్నాడని సమాచారం.

Related News