//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చెన్నైలో తీవ్ర కలకలం.. శశి ఆస్తుల పై విరుచుకుపడ్డ ఐటీ అధికారులు

Category : national

చెన్నైలోని జయ టీవీ కార్యాలయంపై ఆదాపన్నుశాఖ అధికారులు ఈ ఉదయం దాడులకు దిగారు.

ఎక్కత్తుతంగల్‌లోని జయ టీవీ చానల్ కార్యాలయంలోకి ఈరోజు తెల్లవారుజామున 6 గంటలకు చేరుకున్న పదిమంది ఐటీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఆదాయపన్ను ఎగవేతకు సంబంధించి కచ్చితమైన సమాచారంతోనే తనిఖీలకు దిగినట్టు అధికారులు తెలిపారని సమాచారం.

టీవీ చానల్, సీనియర్ అధికారుల కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సీనియర్ ఐటీ అధికారి ఒకరు పేర్కొన్నారు. జయ టీవీని దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించినప్పటికీ ఇటీవల జైలుపాలైన అన్నాడీఎంకే నేత శశికళ కుటుంబ సభ్యుల నియంత్రణలో ఉంది.

శశికళ మేనల్లుడు అయిన వివేక్ జయరామ్ ఇప్పుడు టీవీ బాధ్యతలను చూస్తున్నారు. ఆగస్టులో అన్నాడీఎంకే ప్రభుత్వం సంక్షోభంలో పడినప్పుడు చానల్ నిర్వహణ కష్టమైంది. కాగా, జయ టీవీ కార్యాలయంపై దాడులు నిర్వహించిన అధికారులు తర్వాత వివేక్ నివాసం, శశికళ కుటుంబ సభ్యులకు చెందిన జాజ్ సినిమా కార్యాలయాలపైనా దాడులు నిర్వహించారు. అయితే ఈ సోదాల్లో ఎంత వరకు అక్రమాస్తులు లభ్యమయ్యాయి అనేది తెలియాల్సి ఉంది.