Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రియాంకా గాంధీకి షాక్ .. నివాళుల అనంతరం శాస్త్రి విగ్రహశుద్ధి చేసిన బీజేపీ

Category : national politics

రానున్న లోక్ సభ ఎన్నికల్లో యూపీలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని రంగంలోకి దిగిన ప్రియాంకా గాంధీ మూడు రోజుల గంగా యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీకి ఘోర అవమానం జరిగింది. ప్రచారంలో భాగంగా వారణాసికి చేరుకున్న ఆమె లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి నివాళులర్పించారు. ప్రియాంక అక్కడ వెనుదిరిగిన వెంటనే బీజేపీ కార్యకర్తలు విగ్రహాన్ని శుద్ధి చేయడం వివాదాస్పదంగా మారింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్న ప్రియాంక బుధవారం ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే వారణాసిలో లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అయితే ప్రియాంక అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే కొందరు బీజేపీ కార్యకర్తలు విగ్రహం వద్దకు చేరుకుని ఆమె వేసిన పూలమాలను తొలగించారు.

శాస్త్రి విగ్రహాన్ని గంగాజలంతో శుద్ధి చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రా భార్య అయిన ప్రియాంక గాంధీకి శాస్త్రి విగ్రహాన్నితాకే అర్హత లేదని బీజేపీ కార్యకర్తలు విమర్శించారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Related News