Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పార్టీలో చేరిన వారం రోజులకే జనసేనకు క్రికెట్‌ విజయ్‌ రాజీనామా

Category : state politics

వారం కిందట పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన తిరుపతికి చెందిన బి.విజయకుమార్‌ అలియాస్‌ క్రికెట్‌ విజయ్‌ బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ..

తనకు హీరో పవన్‌ కల్యాణ్‌పై ఉన్న అభిమానంతో గతనెల 26వ తేది రేణిగుంట విమానాశ్రయంలో పార్టీలో చేరానని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ పార్టీకి రాజీనామా చేసిన తాను ఏ పార్టీల్లోనూ చేరడం లేదన్నారు. ఇప్పటి వరకు తాను జిల్లా క్రికెట్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నట్టు తెలిపారు.

మే 25న ఆంధ్రాక్రికెట్‌ అసోసియేషన్‌కు జరిగే ఎన్నికల్లో జిల్లా అసోసియేషన్‌ నుంచి రాష్ట్ర కార్యదర్శిగా తాను పోటీ చేయనున్నట్టు తెలిపారు. అందుకని ఏ పార్టీలో సభ్యత్వం ఉండదకూడదనే నిబంధన నేపథ్యంలో రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు.