Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హోలీకి మందుబాబులకు షాక్ .. మూడు రోజులు నో లిక్కర్

Category : state

హోలీ వచ్చిందంటే చాలు , రంగుల ఆటలే కాదు తాగి తందనాలాడే వాళ్ళు, తాగి తన్నుకు చచ్చే వాళ్ళు , తాగిన మత్తులో రోడ్ ప్రమాదాలకు గురయ్యే వాళ్ళు ప్రతి ఏటా పెరిగిపోతున్నారు. అందుకే హోలీ ప్రశాంతంగా జరుపుకోవాలంటే హోలీ నాడు లిక్కర్ లేకుంటే అంతా పీస్ ఫుల్ అని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. రంగుల వేడుక హోలీ పండుగ సందర్భంగా ఈ సారి కఠిన నిబంధనలు అమలు చెయ్యాలని భావించారు.

హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్ చెయ్యాలని మార్చి 20వ తేదీ హోలీ పండుగ సందర్భంగా రేపటి నుంచి అంటు 20 తేదీ నుంచి 22వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు అంటే మూడు రోజులపాటు హైదరాబాద్‌లోని మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నగర ప్రజలు హోలీని ఆనందంగా జరుపుకోవాలని కోరారు. హోలీ వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

హోలీ వేడుకల్లో భాగంగా మూడు రోజులపాటు నగర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలతో పాటు ..కల్లు కాంపౌండ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్‌లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా హోలీ వేడులను ప్రజలు జరుపుకోవాలని..పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వాహనాలపై గుంపులు..గుంపులుగా ప్రయాణించవద్దని..ప్రయాణీకులపైనా..వాహనాలపై వెళ్లేవారిపైనా వారి అనుమతి లేకుండా బలవంతంగా రంగులు చల్లరాదనీ సీపీ హెచ్చరికలు జారీ చేశారు.