భారీ అంచనాలు పెట్టుకున్న భారత డాషింగ్ క్రికెటర్ యువరాజ్‌కు షాక్ తగిలింది. అతడిని కొనుగోలు చేసేందుకు ఏ జట్టూ అంతగా ఆసక్తి చూపకపోవడంతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అతడి ప్రారంభ ధర(రూ. 2 కోట్లు)కే దక్కించుకుంది.
రెండో సెట్ వేలంలో మొదటిగా భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేయగా, బంగ్లా ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 2 కోట్లకు దక్కించుకుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ. 9 కోట్లకు ఆస్ట్రేలియన్ విధ్వంసకర ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ను, రూ. 2.8 కోట్లకు గౌతం గంభీర్‌ను కొనుగోలు చేసింది. విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోను చెన్నై రైట్ టూ మ్యాచ్ కార్డు ద్వారా రూ. 6.40 కోట్లకు దక్కించుకుంది. న్యూజీలాండ్ కెప్టెన్ విలియమ్సన్‌ను సన్‌రైజర్స్ రూ. 3 కోట్లకు దక్కించుకుంది.
హర్భజన్ సింగ్(భారత్)- చెన్నై సూపర్ కింగ్స్- రూ. 2.0 కోట్లు
షకీబుల్ హసన్(బంగ్లాదేశ్)- సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ. 2.0 కోట్లు
మ్యాక్స్‌వెల్(ఆస్ట్రేలియా)- ఢిల్లీ డేర్‌డెవిల్స్- రూ. 9.0 కోట్లు
గౌతం గంభీర్(భారత్)- ఢిల్లీ డేర్‌డెవిల్స్- రూ. 2.80 కోట్లు
డ్వేన్ బ్రావో(విండీస్)- చెన్నై సూపర్ కింగ్స్- రూ. 6.40 కోట్లు
విలియమ్సన్(కివీస్)- సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ. 3.0 కోట్లు
యువరాజ్ సింగ్(భారత్)- కింగ్స్ ఎలెవెన్ పంజాబ్- రూ. 2.0 కోట్లు