Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నటుడు మురళీమోహన్ ఇన్ని వేళా కోట్లు సంపాదించడం వెనుక ఉన్న అసలు వ్యక్తి....?

Category : movies

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు,రాజకీయ నాయకుడు మురళీమోహన్ అంటే తెలియని వారు ఉండరు. 1980 దశకంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే అటువంటి వ్యక్తి ఈరోజు వేల కోట్లకు అధిపతి కావడం . ఇంత డబ్బు ఎలా సంపాదించారు అనే ప్రశ్నకు సమాధానంగా నోరు విప్పారు మురళీమోహన్ గారు . రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...

ఆ కార్యక్రమంలో భాగంగా ఎదురైన ఓ ప్రశ్నకి ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చాడు. నటుడిగానే కాకుండా నిర్మాణంలోకి వచ్చి సాహసాలు చేస్తోన్న తనను రియల్ ఎస్టేట్ వైపు వెళ్లమని చెప్పింది నటుడు శోభన్ బాబు గారు. ఈ విషయంలో ఆయన తనకు ఎంతో గానో సహాయం చేశారని చెప్పాడు మురళీమోహన్.

వయసు పైబడిన తరువాత అమ్మయిలతో డ్యూయెట్లు వేయడం, నటించడం ఇష్టం లేక సొంతంగా బ్యానర్ స్థాపించి 25 సినిమాలకు పైగా నిర్మాతగా వ్యవహరించినట్టు. ఈ తరుణంలోనే కొందరిని నమ్మి డిస్ట్రిబ్యూషన్ కంపనీలు పెడితే అవి తనను నిలువునా ముంచేశాయని, తన భాగస్వాములు చనిపోవడంతో వారి అప్పులు కూడా తనే కట్టాల్సిరావడంతో ఆర్థికంగా చితికిపోయాయని చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో శోభన్ బాబు భూమిపై పెట్టుబడి పెట్టాలని సూచించడంతో చెన్నైలో కొన్ని స్థలాలు కొన్నానని, ఆ తరువాత చిత్రపరిశ్రమ హైదరాబాద్ కి మారడంతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి బాగా క్లిక్ అయినట్లు మురళీమోహన్ వెల్లడించారు. ఈ రకంగా రియల్ ఎస్టేట్ లో వచ్చిన లాభాలు తనను ఈ రోజు ఇంత వాడిగా మీ ముందు నిలబెట్టాయని ఆయన ఈ విధంగా పేర్కొన్నారు.

Related News