Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి మృతి

Category : politics national

సిద్ధగంగ మఠాధిపతి శివకుమార స్వామి శివైక్యం చెందారు. కొద్దికాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న 111 ఏళ్ల స్వామి.. బెంగళూరులోని సిద్ధగంగ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా మారడంతో ఇవాళ ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర, హోంమంత్రి ఎంబీ పాటిల్ ఆయనను కలిశారు.

స్వామి వారిని దర్శించుకున్నవారిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప, కేంద్రమంత్రి సదానందగౌడ తదితరులు ఉన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరగనున్నట్టు మఠాధికారులు తెలిపారు.