కేంద్ర మంత్రి వర్గంలో నుంచి టీడీపీ మంత్రులు బయటకు రావడం మీద ప్రముఖ నటుడు శివాజీ స్పందించారు.
వారు బయటకి రావడం సంతోషకరమని శివాజీ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పై ఆరోపణలు చేశారు. ‘ఏపీకి అన్యాయం జరుగుతున్న వ్యవహారంలో వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలదే కీలక పాత్ర పోషించారని ఆయన విమర్శించారు.
‘ఏపీకి ప్రత్యేకహోదా ఎవరు తీసుకువస్తారు, ఎవరు హీరోలవుతారనే విషయాలను పక్కనపెడితే .. వెంకయ్యనాయుడు గారు కనుక తన పదవికి రాజీనామా చేస్తే ప్రత్యేకహోదా వెనువెంటనే వస్తుంది. ఆయన హీరో కూడా అవుతారని ఆయన అభిప్రాయపడ్డారు.