//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిజెపికి వ్య‌తిరేకంగా ఓట్లు వేయండి..

Category : politics

ఇప్పుడు దేశంమొత్తం క‌ర్ణాట‌క ఎన్నిక‌ల గురించే చ‌ర్చ న‌డుస్తుంది. బిజెపి, కాంగ్రెస్ లు పోటాపోటీగా ప్ర‌చారం చేస్తున్నాయి. ఒక‌రిపై మ‌రొక‌రు మాట‌ల యుద్దం చేస్తున్నారు. క‌ర్ణాట‌కలో అధికార పార్టీ కాంగ్రెస్ కు బిజెపికి మ‌ధ్య గ‌ట్టిపోటీ ఉంది. అటు బిజెపి, కాంగ్రెస్ ఈ రెండు జాతీయ పార్టీల‌కు ఈ ఎన్నిక‌లు త‌మ భ‌విష్య‌త్తును నిర్ణ‌యించ‌నున్నాయి. క‌ర్ణాట‌క ప్ర‌చారంలో భాగంగా ప్ర‌ధాని మోదీ నిన్న బ‌ళ్లారిలో పర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయ‌న విమ‌ర్శలు వ‌ర్షం కురిపించారు. ప్ర‌ధాని ప్ర‌సంగంపై స్పందించారు టాలీవుడ్ హీరో, ప్ర‌త్యేక హోదాసాధ‌న స‌మితి నేత శివాజి .

మోదీ చేసిన ప్ర‌సంగం వింటే త‌న‌కు చాలా భాద క‌లిగింద‌న్నారు. 2014 ఎన్నిక‌ల్లో దేశాన్ని ఉద్ద‌రిస్తాన‌న్న మోడీ ఈయ‌న కాద‌న్నారు. ద‌క్షిణ భార‌త‌దేశానికి మోదీ ఏలాంటి అభివ‌ద్ది చేయ‌లేద‌న్నారు. ద‌క్షిణ భార‌త‌దేశానికి చాలా గొప్ప ప‌ద‌వులు ఇచ్చామ‌ని మోదీ అస‌త్యాలు చెబుతున్నార‌న్నారు. ద‌క్షిణ భార‌త‌దేశానికి మోదీ తీర‌ని అన్యాయం చేస్తున్నార‌న్నారు. బ‌ళ్లారిలో అవినీతిప‌రులైన గాలి జ‌నార్ద‌న్ రెడ్డి అనుచ‌రుల‌కు 8మందికి బిజెపికి టిక్కెట్లు ఇచ్చిందిని గుర్తుచేశారు. ఎప్పుడూ నీతి గురించి మాట్లాడే మోడీ అవినీతి పరుల‌కు త‌న పార్టీ త‌ర‌పున టీకెట్లు ఇచ్చాడంటే మోడీ ప్ర‌భుత్వం ఎంత అవినితి చేస్తుందో క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు అర్దం చేసుకొవాలన్నారు. దేశంలో న్యాయం అనే ప‌దం చ‌చ్చిపోయింద‌న్నారు. భార‌త‌దేశాన్ని రెండు భాగాలుగా చేసి ద‌క్ష‌ణి భార‌త‌దేశంపై వివ‌క్ష చూపిస్తున్నార‌న్నారు. బ‌ళ్లారిలో తెలుగు వాళ్ల గురించి మోడీ ఒక్క‌మాట కూడా మాట్ల‌డ‌లేదు అన్నారు. క‌ర్ణాట‌క లో ఉన్న తెలుగువాళ్లంద‌రూ బిజెపికి ఓటు వేయ‌వ‌ద్ద‌ని ఆయ‌న శివాజి పిలుపునిచ్చారు. బిజెపిని ఓడించి ద‌క్షిణ భార‌త‌దేశం స‌త్తా ఏంటో చాట‌ల‌న్నారు.

Related News