Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శిఖా చౌదరి సంచలనం ... జయరామ్ హత్య కేసుపై షాకింగ్ కామెంట్స్

Category : state

ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో రాకేష్ రెడ్డి నిందితుడని ఏపీ పోలీసులు తేల్చారు. అయితే ఈ కేసులో శిఖా ప్రమేయం ఉందంటూ...జయరాం వైఫ్ ఆరోపణలు గుప్పిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తెలంగాణ పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో శిఖా చౌదరి ఈ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది.

జయరాం హత్య చేసిన అనంతరం శిఖా ..పేరు తప్ప...దేనిపై కూడా చర్చ జరగలేదన్నారు. భర్త చనిపోయిన బాధలో పద్మశ్రీ ఉంటే...తనపై..తన ఫ్యామిలీపై వస్తున్న వార్తలతో ఆమె హర్ట్ అయి ఉండొచ్చని తెలిపారు. ఎవరైనా తప్పుడు సలహాలు..సూచనలు ఇస్తున్నారేమో...తనను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నట్లు అనుమానం ఉందన్నారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని కుండబద్ధలు కొట్టిన శిఖా పోలీసులకు సహకారం అందిస్తానని తెలిపారు. తనను పక్కాగా ఇరికించే ప్రయత్నం చేస్తే తప్పకుండా న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. జయరాం హత్య కేసుతో తన,..తన ఫ్యామిలీ పరువు పోయిందని..అన్ని విషయాల్లో తాము నష్టపోయామన్నారు శిఖా చౌదరి . పోలీసులు ఈ కేసును పారదర్శకంగా విచారిస్తారనే నమ్మకం ఉందన్నారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డి అన్నీ అబద్దాలే చెబుతాడని శిఖా చౌదరి వెల్లడించారు. రాకేష్ రెడ్డితో ఉన్న రిలేషన్‌షిప్‌పై ఆమె స్పందించారు. మర్డర్ మిస్టరీలో శిఖా పాత్ర ఉందని ప్రచారం జరుగుతుండడంతో జయరాం..రాకేష్ రెడ్డి..ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

2017లో రాకేష్ రెడ్డి పరిచయం అయ్యాడని..టెట్రాన్ కంపెనీలో కొన్ని సమస్యలు వచ్చాయని...దీనిని పరిష్కరించాలని జయరాం సూచించినట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం..ఇతరుల సహాయంతో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. సెటిల్ మెంట్ విషయంలో చెక్కులు ఇచ్చారని..కానీ కొన్ని డబ్బులు జయరాం ఇవ్వలేకపోయారని వివరించారు. సెటిల్ మెంట్ జరుగుతున్న సందర్భంలో రాకేష్ రెడ్డి...జోక్యం చేసుకుని కొంత సమస్య పరిష్కరించే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు.ఆరేడు నెలల నుండి రాకేష్‌తో పరిచయం ఉందని తెలిపిన శిఖా ...తరువాత అతను అన్నీ అబద్దాలు చెబుతాడని గుర్తించినట్లు పేర్కొన్నారు. 9 నెలల నుండి రాకేష్‌ను కలవలేదని...ఏమీ చేస్తున్నాడో తెలియదన్నారు. అతడిని వ్యవహార శైలి గురించి అప్పట్లోనే జయరాంకు చెప్పినట్లు తెలిపారు. రాకేష్ రెడ్డి తనను పెళ్లి చేసుకుందామని అనుకొని ఉండవచ్చని అయితే తాను మాత్రం అతడిని పెళ్లి చేసుకొనే ఆలోచన లేదన్నారు. రాకేష్ రెడ్డితో జయరాంకు పరిచయం ఉందనే విషయం తనకు నిజంగా తెలియదని శిఖా తెలిపారు.