పాకిస్థానీ మహిళ అలీష్బాతో షమీకి అక్రమ సంబంధం ఉందని ఆరోపించిన టీం ఇండియా ఆటగాడు మహ్మద్ శమి భార్య మరోసారి షమిపై తీవ్ర ఆరోపణలు చేసింది. తన భర్తను రోడ్డు మీద ఉతికి ఆరేయాలని వ్యాఖ్యానించింది. వివరాల్లోకి వెళితే షమికి వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన హాసిన్ జహాన్ ఈసారి భర్తపై ఆరోపణలను తీవ్రం చేసింది. తాను షమీకి మంచి స్నేహితురాలిని మాత్రమేనని, అతడికి ఉన్న లక్షలాదిమంది అభిమానుల్లో తాను ఒకరిని మాత్రమేనని, అంతకుమించి తమ మధ్య మరేమీ లేదని అలీష్బా సోమవారం వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో ఆ వ్యాఖ్యలు హాసిన్ ఖండించింది. “అసలు అలీష్బా షమీ ఫ్యాన్ కాదు. ఆమె బహుశా గాళ్ ఫ్రెండ్ అయి ఉంటుంది. ఆమె ఓ వేశ్య. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఓ వ్యక్తిని కలిస్తే అది నీచం కాకుండా ఎలా ఉంటుంది? నా భర్తతో ఉన్న వివాహ బంధాన్ని తెంచేందుకే ఆమె వచ్చింది. నా భర్తేమీ తక్కువ కాదని వ్యాఖ్యానించింది. అలాగే శమి దుబాయ్ వెళ్లడాన్ని ఆమె తప్పు బడుతు సంచలన వ్యాఖ్యలు చేసింది.
‘‘షమీతో అలీష్బాకు సంబంధం ఉందని నేను ఇప్పటికే చాలాసార్లు మీకు చెప్పా. దుబాయ్‌లో వాళ్లు కలిసేది తమ కోర్కెలు తీర్చుకోవడానికే. ఇద్దరూ కలుసుకునేందుకు జనవరిలోనే ప్లాన్ చేసుకున్నారు. హోటల్లో వారు ఒక్క బ్రేక్ ఫాస్ట్తోనే సరిపెట్టారా? ఎంతమాత్రమూ కాదు.. వారి కలయిక బెడ్‌పై ముగిసిందని పేర్కొన్న ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘షమీని నేను చావబాదేటప్పుడు మీరంతా కలిసి రావాలి. రోడ్డుపై అతడిని ఉతకాలి. ఎంతమంది అమ్మాయిల జీవితాలతో అతడు ఆడుకుంటాడు?’’ అని ఆరోపించింది.