//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

షమి అప్పట్లో ఆత్మహత్యాయత్నం చేశాడు: క్రికెటర్ షమి భార్య

Category : sports

టీమిండియా బౌలర్ మహమ్మద్‌ షమి మీద అతని భార్య చేస్తోన్న ఆరోపణలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

ఆమె తాజాగా మరోసారి మహమ్మద్‌ షమి గురించి మరిన్ని విషయాలను బహిర్గతం చేసింది. తాము మొట్టమొదటగా 2012లో కలుసుకున్నామని, అయితే, అంతకుముందే షమి తన సమీప బంధువుల్లో ఒక అమ్మాయితో ప్రేమాయణం కొనసాగించాడని ఆమె తెలిపింది.

అయితే షమీ ప్రేమించిన అమ్మాయి కుటుంబసభ్యులు షమితో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో, మనస్తాపానికి గురైన షమి ఆత్మహత్యాయత్నం కూడా చేశాడని ఆమె తెలిపింది. షమి కోసం తాను తనకు ఇష్టమైన మోడలింగ్‌ కెరీర్ వదులుకున్నానని కాని వేరే ఆడవాళ్ళ మోజులో ఉన్న షమీ కొన్ని రోజుల నుంచి తనను వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పింది. తనకు విడాకులు ఇవ్వాలని అడుగుతున్నాడని, ఆస్తులు, బీమాకు సంబంధించిన పత్రాలను కూడా తీసుకున్నాడని ఆరోపించింది.