//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నా భర్తపై ప్రేమ చావదు !

Category : sports

టీం ఇండియా ఆటగాడు మహ్మద్ శమి భార్య రూటు మార్చింది. భర్తకు ప్రమాదం జరిగింది అని తెలియగానే ఆమె చూడటానికి ఢిల్లీ వెళ్ళింది. వివరాల్లోకి వెళితే గత నెల రోజులుగా షమిపై ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.తన భర్తకు అనేక మంది అమాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన ఆమె అతను ఒక ఫిక్సర్ అని కూడా ఆరోపణలు చేసింది. అయితే దీనిపై విచారణ చేసిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అతను నిర్దోషి అని ప్రకటించింది.

ఈ నేపధ్యంలో అతని కాంట్రాక్ట్ ని కూడా బిసిసిఐ పునరుద్దరించిన సంగతి తెలిసిందే. దీనితో అతను ఐపియల్ పాల్గొనడానికి మార్గం సుగుమం అయింది. ఇందుకోసం డెహ్రాడూన్ లో శిక్షణ తీసుకుంటున్న శమి కారులో ఢిల్లీ బయల్దేరి వెళ్తుండగా మార్గ మధ్యలో ప్రమాదం జరిగింది. స్వల్ప గాయాలతో బయట పడిన అతను ప్రస్తుతం ఢిల్లీలో చికిత్స తీసుకుంటున్నాడు. దీనితో అతనిని చూడటానికి గాను హాసిన్ జహాన్ ఢిల్లీ వెళ్ళింది.

ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. షమీ ప్రమాదానికి గురయ్యాడని తెలిసి తనకు ఎంతో బాధకలిగిందని, అతను తన భర్త అని, తనపై ఇంకా ప్రేమ ఉందని హసీన్ తెలిపింది. తన పోరాటం షమీ తన విషయంలో చేసిన తప్పులపై కానీ, షమీపై కాదని అమె అంది. ఎన్ని గొడవలు జరిగిన తన భర్తపై ఉన్న ప్రేమ ఎప్పటికీ చావదని ఆమె వెల్లడించింది. కాగా షమికి ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఆమె ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే..అతనికి పనిమనిషితో కూడా అక్రమ సంబంధం ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది.