//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మేజర్ల వివాహాలకు శక్తీనిస్తున్న శక్తీ వాహిని..!

Category : national

పరువు హత్యలు, ఆ తరహా నేరాలను అరికట్టాలంటూ ‘శక్తి వాహిని’ అనే ఎన్జీవో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.మేజర్లైన ఇద్దరు యువతీయువకులు పెళ్లి చేసుకుంటే ఆ విషయంలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన ముగ్గురు సభ్యుల బెంచ్ సోమవారం (ఫిబ్రవరి 5) ఈ మేరకు వెల్లడించింది.పరువు హత్యలను అరికట్టాలనే అంశంపై దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.

వివాహం చేసుకున్న ఇద్దరు మేజర్ల విషయంలో తలదూర్చే హక్కు థర్డ్ పార్టీకీ లేదు.వారు తల్లిదండ్రులు, సమాజం, పంచాయతీలు ఇంకెవ్వరైనా కావొచ్చు.వయోజనులైన ఇద్దరు యువతీ యువకులు పెళ్లి చేసుకోవాలనుకోవడం, కలిసి జీవించాలనుకోవడం వారి స్వేచ్ఛా హక్కు కిందకు వస్తుంది అని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న జంటలను ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా హరియాణాలో ఖాప్‌ పంచాయితీలు, గ్రామాల్లో సొంతగా ఏర్పాటు చేసుకున్న న్యాయవ్యవస్థలు చట్ట వ్యతిరేకమైన విధానాలతో దారుణంగా శిక్షిస్తున్నాయి, వాటిని అడ్డుకోవాలని పిటిషన్‌లో కోరారు.

పరువు హత్యల తరహా నేరాలకు ఖాప్‌ పంచాయతీలు కూడా వ్యతిరేకమేనని వాటి తరఫున వాదించిన న్యాయవాది వాదనలు వినిపించారు.ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుంటూ ఖాప్‌ పంచాయతీల గురించి మాకు ఆందోళన లేదు.మేము కేవలం పెళ్లి చేసుకునే జంటల హక్కుల గురించే ఆందోళన చెందుతున్నాం అని వ్యాఖ్యానించింది.