//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శైలజ రెడ్డి అల్లుడు మూవీ రివ్యూ

Category : movies

శైలజా రెడ్డి అల్లుడు రివ్యూ ..!

చిత్రం : శైలజా రెడ్డి అల్లుడు

తారాగ‌ణం: నాగ‌చైత‌న్య‌, అను ఇమ్మాన్యుయేల్‌, ర‌మ్య‌కృష్ణ‌, సీనియ‌ర్ న‌రేశ్‌

సంగీతం: గోపీ సుంద‌ర్‌

ఛాయాగ్ర‌హ‌ణం: నిజార్ ష‌ఫీ

నిర్మాత‌లు: నాగ‌వంశీ.ఎస్‌, పిడివి.ప్ర‌సాద్‌

ద‌ర్శ‌క‌త్వం: మారుతి

హీరోగా తన కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నాగ‌చైత‌న్య క‌మ‌ర్షియ‌ల్ హీరో కావాల‌ని చేయ‌ని ప్ర‌య‌త్నాలు లేవు. అందులో బాగంగా కామెడీ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడు మారుతితో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. మ‌తిమరుపుతో ఇబ్బంది ప‌డ‌ట‌మో.. ప‌రిశుభ్ర‌త గురించి ఎక్కువ శ్ర‌ద్ధ తీసుకోవ‌డం.. వంటి వినూత్న కథాంశాలతో ఇటీవ‌ల స‌క్సెస్ అందుకున్న మారుతి డైరెక్ష‌న్‌లో నాగచైత‌న్య హీరోగా రూపొందిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ శైల‌జారెడ్డి అల్లుడు. ఇందులో శైల‌జారెడ్డిగా ర‌మ్య‌కృష్ణ న‌టించ‌డం విశేషం. శివ‌గామి వంటి ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించిన ర‌మ్య‌కృష్ణ శైల‌జారెడ్డిగా క‌న‌ప‌డుతుందంటే క‌థ‌లో ఆమెకు ఉన్న ప్రాధాన్య‌త తెలుస్తోంది. అదీగాక అత్తా, అల్లుడు సినిమా అంటే ఇద్ద‌రి మ‌ధ్య కామ‌న్‌గా జ‌రిగే గొడ‌వ‌లున్న సినిమాల‌ను చాలానే చూశాం. మ‌రి ఈ శైల‌జారెడ్డి అల్లుడు అత్త‌తో గొడ‌వ‌ప‌డ‌తాడా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

క‌థ:

పెద్ద బిజినెస్ మేన్ రావ్‌(ముర‌ళీశర్మ‌)కు చాలా ఇగో ఉంటుంది. ప్ర‌తి చిన్న విష‌యానికి ఆయ‌న ఇగో ఫీల‌వుతుంటారు. ఆయ‌న ఇగో కార‌ణంగా కూతురి పెళ్లి కూడా ఆగిపోతుంది. అయితే రావ్ కొడుకు చైత‌న్య‌(అక్కినేని నాగ‌చైత‌న్య‌) మాత్రం తండ్రి భిన్న‌మైన మ‌న‌స్త‌త్వాన్ని క‌లిగి ఉంటాడు. త‌ను అను (అను ఇమ్మాన్యుయేల్‌)ను ప్రేమిస్తాడు. ఆమె ఓ ఆర్టిస్ట్‌(పెయింట‌ర్‌). అను మంచి అమ్మాయే అయినా ఆమెలో విప‌రీత‌మైన ఇగో ఉంటుంది. ఆ కార‌ణంగా చైతుపై ప్రేమ‌ను చెప్ప‌డానికి కూడా ఆలోచిస్తుంటుంది. చివ‌ర‌కు ఎలాగో చైతు ఆమెతో ఐ ల‌వ్ యూ చెప్పించుకుంటాడు. వీరి ప్రేమ వ్య‌వ‌హారం చైతు తండ్రికి తెలుస్తుంది. అయితే ఆమెలోని ఇగో చూసి ఆయ‌న కూడా అనుని త‌న కోడలు చేసుకోవ‌డానికి అంగీక‌రిస్తాడు. ఓ ప్రైవేట్ ఫంక్ష‌న్‌లో ఇగో హార్ట్ కావ‌డంతో అక్క‌డే చైతు, అనుకి ఇష్టం లేక‌పోయినా నిశ్చితార్థం జ‌రిపించేస్తాడు. కానీ అప్పుడే అను గురించి అస‌లు నిజం అంద‌రికీ తెలుస్తుంది. వ‌రంగ‌ల్‌కి చెందిన శైల‌జారెడ్డి(ర‌మ్య‌కృష్ణ‌) కూతురే అను. ఆమె త‌ల్లి అనుమ‌తి లేకుండా ఆమెను పెళ్లి చేసుకోవ‌డం కుద‌ర‌ద‌ని... దాంతో ఇక ప్రేమ గెలిపించుకోవ‌డం కోసం చైతు వరంగ‌ల్ చేరుకుంటాడు. శైల‌జారెడ్డిని చైతూ ఎలా త‌మ పెళ్లికి ఒప్పిస్తాడ‌నేదే అస‌లు క‌థ‌. అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:

సినిమాలో రావ్ అనే పాత్ర ఎంత ఇగోయిస్టిక్‌గా ఉంటుందనేదే దానిపై సినిమా ఓపెన్ అవుతుంది. సినిమాలో హీరోను పాజిటివ్ కోణంలో ఎలివేట్ చేశారు. అలాగే హీరో తండ్రిని పోలిన మ‌న‌స్త‌త్వంతో హీరోయిన్ క్యారెక్ట‌ర్ ఉంటుంది. ఆమెతో హీరో ప్రేమ‌లో ప‌డ‌టం.. త‌న ప్రేమ‌ను స‌క్సెస్ చేసుకోవ‌డానికి హీరోయిన్ ఇగోనే అడ్డం పెట్టుకునే స‌న్నివేశాలు.. సిచ్యువేష‌న్స్ ప‌రంగా వెన్నెల‌ కిషోర్ కామెడీ.. అంతా ఓకే అనిపిస్తుంది. ర‌మ్య‌కృష్ణ క్యారెక్ట‌ర్ ఇంట్ర‌డ‌క్ష‌న్‌తో ఫ‌స్టాఫ్ పూర్త‌వుతుంది. ర‌మ్య‌కృష్ణ‌ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సెకండాఫ్ అంతా సినిమా ఆమె పైనే న‌డుస్తుంది. ర‌మ్య‌కృష్ణ‌.. శైల‌జారెడ్డి పాత్ర‌ను సునాయ‌సంగా పోషించారు. ఫ‌స్టాప్ కంటే సెకండాఫ్‌లో పృథ్వీ, వెన్నెల‌కిషోర్ కామెడీ స‌న్నివేశాలు ఓకే.. అయితే సాధార‌ణంగా మారుతి తెర‌కెక్కించిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు సినిమాల్లో హీరో క్యారెక్ట‌ర్ నుండే కామెడీ పుడుతుంది. నిజార్ ష‌ఫీ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. గోపీసుంద‌ర్ సినిమాకు అందించిన నేప‌థ్య సంగీతం కొన్ని సీన్స్‌లో బావున్నాయి. అయితే యాక్ష‌న్ సీన్స్‌లో ఆర్‌.ఆర్ బాగా లేదు. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్‌:

- న‌టీన‌టులు

- సినిమాటోగ్ర‌ఫీ

- ఫ‌స్టాఫ్

మైన‌స్ పాయింట్స్‌:

- బ్యాగ్రౌండ్ స్కోర్‌

- కామెడీ లేక‌పోవ‌డం

- సెకండాఫ్ లెంగ్తీగా అనిపించ‌డం

- కొన్ని అనవసర పాత్ర‌లు

బోటమ్ లైన్‌: అత్తని మెప్పించిన అల్లుడు ..అభిమానులని మెప్పించలేక పోయాడు.

రేటింగ్ : 2 / 5