//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏమి రికార్డ్స్ స్వామీ..... 48 గంటల్లో 70 మిలియన్ వ్యూస్ ..!

Category : movies

బాలీవుడ్ కింగ్ ఖాన్ Shahrukh Khan నటించిన లేటెస్ట్ మూవీ జీరో. ఇందులో షారుక్ మరుగుజ్జు గా నటిస్తున్నడు . ఈ మూవీ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి . చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత నికార్సాయిన హిట్ లేక 5 ఏళ్లుగా క్లీన్ హిట్ కోసం ఎదురు చూస్తున్న కింగ్ ఖాన్ ఈ సినిమా తో కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర తనదైన రేంజ్ లో కంబ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. విషయానికి వస్తే ఎత్తు తక్కువగా ఉన్న శాపాన్ని దేవుడు ఇచ్చినా అదేమీ లెక్క చేయకుండా జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించే బయువా సింగ్(Shahrukh Khan)మ్యారేజ్ బ్యూరోలో ఆఫియా(అనుష్క శర్మ)ఫోటో చూసి మనసు పారేసుకుంటాడు. Shahrukh Khan Zero Movie Trailer Records

కాని ఆఫియాకు పక్షవాతం ఉంటుంది. శరీరం చక్రాల కుర్చీకి అతుక్కుపోవడంతో పాటు నోట మాట సైతం ముద్దగా వచ్చే పరిస్థితి. అయినా కూడా తన మీద ప్రేమను పెంచుకుంటాడు. అది బలపడుతున్న సమయంలో సినిమాల్లో హీరోయిన్ గా నటించే నటితో పరిచయం ఏర్పడుతుంది. ఇక అక్కడి నుంచి ట్రయాంగిల్ లవ్ షురూ. అనూహ్యమైన సంఘటనల తర్వాత ఈ ప్రేమ చదరంగంతో పాటు స్పేస్ షిప్ కు రాకెట్ లో వెళ్లే పరిస్థితి వస్తుంది. అసలు ఈ ప్రేమ ఏంటి జీరో అనే పేరు ఎందుకు పెట్టారు తదితరాలన్నీ సిల్వర్ స్క్రీన్ మీదే చూడాలి

రీసెంట్ గా షారుక్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ట్రైలర్ అల్టిమేట్ రికార్డులను తొలి 24 గంటల్లో సాధించి వరల్డ్ రికార్డ్ కూడా సొంతం చేసుకుంది. వ్యూస్ పరంగా ఇండియా లో మరే ట్రైలర్ కి రానంతగా 40 మిలియన్ వ్యూస్ ని 24 గంటల్లో సాధించి దుమ్ము లేపింది . ఈ జీరో ట్రైలర్ .Shahrukh Khan Zero Movie Trailer Records

లైక్స్ పరంగా ఏకంగా అవెంజర్స్ ట్రైలర్ 22 గంటల్లో ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ ని అందుకుంటే జీరో ట్రైలర్ కేవలం 18 గంటల్లో ఆ రికార్డ్ ని బ్రేక్ చేసింది. మొత్తం మీద 24 గంటలలో 40 మిలియన్ వ్యూస్ ని 1.2 మిలియన్ లైక్స్ ని సాధించి దిమ్మతిరిగే రికార్డులతో దుమ్ము దుమారం చేసింది. ప్రస్తుతం ఈ జీరో ట్రైలర్ 70 మిలియన్ వ్యూస్ తో , అలాగే 1 .5 మిలియన్ లైక్స్ ఎవ్వరికి అందనంత ఎత్తులో దూసుకుపోతుంది .Shahrukh Khan Zero Movie Trailer Records