Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పాకిస్తాన్ ఎన్నికల్లో పోటి చేస్తున్న స్టార్ హీరో సోదరి

Category : national movies world

బాలివుడ్ బాద్షా షారూఖ్‌ఖాన్ సోదరి నూర్జహాన్ పాక్ ఎన్నికల్లో పోటీ చేయనుంది. షారూఖ్ సోదరి అయిన నూర్జహాన్ పాకిస్థాన్ లో వచ్చే నెల 25వతేదీన జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఖైబర్ ఫక్తూన్ ఖవా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనుందని సమాచారం. నూర్జహాన్ తన కుటుంబంతో కలిసి షావాలి ఖతాల్ ప్రాంతంలో నివాసముంటోంది.

నూర్జహాన్ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆమె గతంలో కౌన్సిలరుగా కూడా సేవలందించింది. ఆమెకు షారుక్ కుటుంబంతో మంచి సంబంధాలే ఉన్నాయి. నూర్జహాన్ గతంలో రెండు సార్లు ముంబై వచ్చి షారూఖ్ కుటుంబసభ్యులను కలిసింది. మొత్తంమీద షారూఖ్ ఖాన్ సోదరి పాక్ ఎన్నికల్లో పోటీ చేయనుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

Related News